Leading News Portal in Telugu

Nubia Air Launched at IFA 2025: Super Slim 5G Phone with 5000mAh Battery & AI Features


Nubia Air: IFA 2025 లో ZTE తన తాజా స్మార్ట్‌ఫోన్ nubia Air ని లాంచ్ చేసిందిట. ఇది “Air-style” విభాగంలో విడుదల చేసిన తొలి మొబైల్. ఇది 5.9mm మాత్రమే మందం ఉన్న స్లిమ్ బాడీ, 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 5000mAh పెద్ద బ్యాటరీ, ఇంటెలిజెంట్ AI ఫీచర్లు, అలాగే కేవలం 172 గ్రాములు బరువు ఉండడంతో ఈ ఫోన్ ని ప్రత్యేకంగా కనిపించేలా చేస్తున్నాయి.

స్లిమ్ బాడీ, పెద్ద బ్యాటరీ:
nubia Air 5.9mm సూపర్ స్లిమ్ అయినప్పటికీ, 5000mAh సామర్థ్యమైన బ్యాటరీని కలిగి ఉంది. nubia AI పవర్-సేవింగ్ టెక్నాలజీతో.. ఈ ఫోన్ 1,000 చార్జ్ సైకిల్స్ వరకు నిలిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే, యూజర్లు మూడు సంవత్సరాల పైగా నమ్మదగిన, రోజువారీ ఉపయోగం కోసం దీన్ని ఉపయోగించవచ్చు.

టాప్-లెవల్ వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్:
nubia Air మొబైల్ IP68, IP69, IP69K సర్టిఫికేషన్లతో అందుబాటులో ఉంది. ఇది 1.5m లో 30 నిమిషాలు నీటిలో మునిగినా లేదా 80°C హై-ప్రెజర్ వాటర్ జెట్ ఎదుర్కొన్నా, ఫోన్ సురక్షితంగా ఉండగలదు. అలాగే ఇది అల్యూమినియం అలాయ్ ఫ్రేమ్, 6,000 కంటిన్యూస్ డ్రాప్ టెస్టులు, 600 రోలింగ్ డ్రాప్ టెస్టులు ఇంకా 5 ఫ్రీ-ఫాల్ రౌండ్స్ ద్వారా దీని డ్యూరబిలిటీ పరీక్షించబడింది.

ఏజ్ జస్ట్ జస్ట్ నెంబర్.. బౌలర్లపై విరుచకపడ్డ Kieron Pollard! 17 బంతుల్లోనే?

Nubia Air

ప్రాసెసర్ & AI ఫీచర్లు:
ఈ కొత్త nubia Air UNISOC T8300 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్‌తో, AI పెర్ఫార్మన్స్ ఇంజిన్ సహాయంతో పనిచేస్తుంది. CPU పనితీరును ఆప్టిమైజ్ చేసే AI షెడ్యూలింగ్, అరుదుగా ఉపయోగించే యాప్‌లను ఫ్రీజ్ చేసే యాప్ ఫ్రీజ్ వంటి ఫీచర్లు బ్యాటరీ జీవితం 20% పొడిగిస్తాయి. అలాగే పవర్ ఖర్చు 25% తగ్గిస్తాయి.

nubia Air స్పెసిఫికేషన్లు:

* 6.78-inch 1.5K AMOLED, 120Hz, 440ppi, 4500 nits, Corning Gorilla Glass 7i

* 8GB RAM (డైనమిక్ RAM తో 12GB వరకు), 256GB స్టోరేజ్

* UNISOC T8300 (2×2.2GHz Cortex-A78 & 6×2.0GHz Cortex-A55) + Mali-G57 MP2 GPU

* 50MP + 2MP + Auxiliary Rear Camera, 20MP Front Camera

* ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్

* Smart AI ఫీచర్లు: Dynamic Image, AI Sport Snapshot, Video Anti-shake, AI Magic Photos, Real-time Translate, Dual-Mic AI Noise Cancellation

* HiFi 4 DSP ఆడియో, 5G, Wi-Fi 6, Bluetooth 5.4, GPS

* డైమెన్షన్స్: 164.2 x 76.6 x 6.7 mm; బరువు: 172 g

* 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జింగ్

Road Accident: టస్కర్ కిందపడి జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికురాలు మృతి!

Image (4)

nubia Air టైటానియం బ్లాక్, స్ట్రిమర్ బ్లాక్, టైటానియం డెసర్ట్ కలర్‌ లలో వస్తుంది. మొదట యూరప్‌లో విడుదల అయినా తరువాత సౌత్ ఈస్ట్ ఆసియ, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ లతోపాటు ఇతర మార్కెట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర USD 279 (రూ. 24,695).