iPhone Air: ఆపిల్ (Apple) సంస్థ నిర్వహించిన ‘Awe Dropping’ ఈవెంట్ లో iPhone Air ని అధికారికంగా లాంచ్ చేసింది. ఇది Cupertino ఆధారిత టెక్ దిగ్గజం కొత్తగా ప్రవేశపెట్టిన మోడల్‌గా, గత సంవత్సరం విడుదలైన iPhone 16 Plus ను బదులుగా లాంచ్ అయ్యింది. ఇక ఐఫోన్ 17 సిరీస్ మొబైల్స్ A19-సిరీస్ చిప్సెట్, ఆపిల్ ఇంటలిజెన్స్ మద్దతుతో అందుబాటులోకి వచ్చినా.. ఐఫోన్ ఎయిర్ స్లిమ్ ఫార్మ్ ఫ్యాక్టర్ లో వస్తూ మిగితా కంపెనీల స్లిమ్ మొబైల్స్ తో పోటీ పడనుంది.
iPhone Air ఫీచర్లు:
iPhone Air కేవలం eSIM ఫోన్‌గా మాత్రమే విడుదల అయ్యింది. ఇది iOS 26 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో 6.5 అంగుళాల Super Retina XDR OLED డిస్ప్లే ఉంది. ఇది 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ప్రోమోషన్ మద్దతుతో లభిస్తుంది. ఇది మనం వాడే పనితీరు పరిస్థితులపై ఆధారపడి 10Hz నుండి 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేసుకుంటుంది.
ఆపిల్ సంస్థ ప్రకారం iPhone Air ఇప్పటి వరకు రూపొందించిన అత్యంత సన్నని ఐఫోన్ మోడల్. ఇది కేవలం 5.6mm మందంగా ఉంటుంది. ఇది 80% రీసైకిల్డ్ టైటానియం మెటీరియల్స్‌తో తయారయ్యింది. ఫ్రంట్, బ్యాక్ ల్లో సిరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్ ఇవ్వడం ద్వారా ఇది క్రాక్‌లకు నాలుగు రెట్లు ఎక్కువ రెసిస్టన్స్ కలిగిన ఫోన్ గా నిలిచింది.
A19 చిప్, 48MP కెమెరా, iOS 26 ఫీచర్లతో Apple iPhone 17 లాంచ్.. ఫీచర్లు, ధరలు ఇలా!
iPhone Air A19 Pro SoC తో నడుస్తుంది. ఇది 6-కోర్ CPU, 6-కోర్ GPU, 16-కోర్ న్యూరల్ ఇంజన్ కలిగి ఉంటుంది. అలాగే ఇందులో రెండో తరం ‘డైనమిక్ క్యాచింగ్’ సాంకేతికత వల్ల మెరుగైన మ్యాథ్ రేట్లు, యూనిఫైడ్ ఇమేజ్ కంప్రెషన్ సపోర్ట్ లభిస్తోంది. ఆపిల్ ఇంటలిజెన్స్ ఫీచర్లు కూడా ఇందులో బాగా ఉపయోగపడుతాయి. అంతేకాకుండా ఈ ఫోన్లో కొత్త N1 చిప్ కూడా ఉంటుంది. ఇది Wi-Fi 7, Bluetooth 6, థ్రెడ్ ఫీచర్లను అందిస్తుంది. అలాగే C1X మోడెమ్ కలిగి ఉండటం ద్వారా iPhone 16e లోని C1 మోడెమ్ తో పోలిస్తే రెట్టింపు వేగవంతమైన నెట్వర్క్ సామర్థ్యం, అధిక సామర్థ్యాన్ని అందిస్తుంది.
కెమెరా:
iPhone Air 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ మైన్ కెమెరా అందిస్తుంది. ఇందులో f/1.6 అపెర్చర్, సెన్సార్-షిఫ్ట్ OIS, మరియు 2X టెలిఫోటో కెమెరా సామర్థ్యం కలిగివుంది. ఇక ఫ్రంట్ భాగంలో 18 మెగాపిక్సెల్ సెంటర్ స్టేజి సెల్ఫీ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ సామర్థ్యం:
ఆపిల్ సంస్థ కావాలనే iPhone Air బ్యాటరీ స్పెసిఫికేషన్స్ ను వెల్లడించలేదు. కానీ, దీనిని ఒకసారి ఛార్జ్ చేసుకుంటే మొత్తం రోజు ఉపయోగించగల సామర్థ్యం కలిగివుండడంతో పాటు, 27 గంటల వీడియో ప్లేబ్యాక్ కూడా అందిస్తుంది. 30 నిమిషాల్లో 50% ఛార్జింగ్ సాధ్యమని, వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది.
iPhone 17 Series: ఆపిల్ iPhone 17 సిరీస్ లాంచ్.. ఏ ఫోన్ ఎంతకు లభిస్తుందంటే?
iPhone Air ధర:
iPhone Air ధర అమెరికాలో 256GB స్టోరేజ్ వెరియంట్ $999 నుంచి ప్రారంభమవుతుంది. అదేవిధంగా 512GB, 1TB స్టోరేజ్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. భారతదేశంలో iPhone Air ధర విషయానికొయ్ వస్తే.. 256GB స్టోరేజ్ వెరియంట్ రూ.1,19,900, 512GB వెరియంట్ రూ.1,39,900, 1TB వెరియంట్ రూ.1,59,900లకు లభిస్తుంది. ఈ మొబైల్స్ స్కై బ్లూ, లైట్ గోల్డ్, క్లౌడ్ వైట్, స్పేస్ బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి వస్తుంది. ప్రీ-ఆర్డర్ సెప్టెంబర్ 12 నుండి మొదలు అవుతుంది. ఇక సెప్టెంబర్ 19 నుంచి ప్రపంచవ్యాప్తంగా డెలివరీలు అందించబడుతాయి.