Apple AirPods Pro 3 Launched with Advanced ANC, Health Tracking, Live Translation.. Price and Features are
Apple AirPods Pro 3: ‘Awe Dropping’ ఈవెంట్ లో AirPods Pro 3 ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కొత్త తరం ఎయిర్‌పోడ్స్ Pro 3లో ఆధునిక Active Noise Cancellation (ANC), Adaptive EQ, మెరుగైన ఫిట్, హెల్త్ అండ్ ఫిట్నెస్ ట్రాకింగ్ ఫీచర్లు, లైవ్ ట్రాన్సలేషన్ వంటి వినూత్న ఫీచర్లు కలిగి ఉన్నాయి. ఈ కొత్త AirPods Pro 3 ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఇందులో కొత్తగా తీసుకొచ్చిన ఇంటర్నల్ స్ట్రక్చర్ ద్వారా వినియోగదారులకు సురక్షితమైన, స్టేబుల్ ఫిట్ అందించబడుతుంది. ఇందులో 5 వేరు-వేరు సైజుల (XXS – L) ఫోమ్-ఇన్ఫ్యూజ్డ్ ఇయర్ టిప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి విభిన్న వయస్సుల, చెవుల ఆకారాలకు తగ్గట్టుగా రూపొందించబడ్డాయి. ఇవి IP57 రేటింగ్ కలిగి ఉండటం వల్ల చెమట, నీటి నుంచి పూర్తిగా రక్షణ కలిగివుంటాయి.
ఈ కొత్త ఎయిర్ పాడ్స్ ఆపిల్ మల్టిపోర్ట్ అకోస్టిక్ ఆర్కిటెక్చర్ ద్వారా స్పేషియల్ ఆడియో, వివరమైన లిజనింగ్ అనుభవాన్ని పొందవచ్చు. మ్యూజిక్, షోస్, మరియు కాల్స్ కోసం అడాప్టివ్ EQ బేస్ ను మెరుగుపరచి, సౌండ్‌స్టేజ్‌ను విస్తరించి, స్పష్టమైన వాక్యాలను అందజేస్తుంది. ఆపిల్ ప్రకారం, ANC సామర్థ్యం AirPods Pro 2 తో పోలిస్తే 2 రెట్లు, అసలు AirPods Pro తో పోలిస్తే 4 రెట్లు మెరుగైనదిగా చెబుతుంది. ట్రాన్స్పరెన్సీ మోడ్ వల్ల సహజమైన శబ్దాలను రీప్రొడ్యూస్ చేస్తుంది. ఇక బ్యాటరీ లైఫ్ ANC తో 8 గంటలు, ట్రాన్స్పరెన్సీ మోడ్ లో 10 గంటల వరకు ఉంటుంది. MagSafe Case సహాయంతో మొత్తం 24 గంటల ప్లేబ్యాక్ లభిస్తుంది.
A19 Pro చిప్, పేపర్ ఛాంబర్, ట్రిపుల్ 48MP కెమెరాలతో సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లు Apple iPhone 17 Pro, Pro Max లాంచ్!
AirPods Pro 3 లో ఆరోగ్య, ఫిట్నెస్ ఆధారిత ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఎయిర్‌పోడ్స్ Pro 3లో ఫోటోప్లెతిస్మోగ్రఫీ (PPG), ఇన్ఫ్రారెడ్ లైట్ ఆధారంగా హార్ట్ రేట్ సెన్సార్ ను కలిగి ఉంది. ఇది వినియోగదారుల హార్ట్ రేట్‌ను సక్రమంగా మానిటర్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. ఇది 50 కి పైగా వర్కౌట్ టైప్స్, హార్ట్ రేట్, కాలొరీస్ బర్న్, మూవ్ రింగ్ ప్రోగ్రెస్‌ను ట్రాక్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. యాక్సలరోమీటర్, జైరోస్కోప్, GPS, ఆన్-డివైస్ AI ను కలిపి సెన్సార్ ఫ్యూజన్ ఫీచర్ ద్వారా వినియోగదారుల శారీరక చలనం, పనితీరు గణనీయంగా మానిటర్ చేయబడుతుంది.
అలాగే, వర్క్ అవుట్ బడ్డీ ఫీచర్ ద్వారా వినియోగదారుల వర్కౌట్ హిస్టరీ ఆధారంగా వ్యక్తిగత సూచనలు అందజేయబడతాయి. దానితో మరింత సమర్థవంతమైన ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను అనుసరించవచ్చు. Apple Fitness+ తో కూడిన AirPods Pro 3 రియల్ టైం పెర్ఫార్మెన్స్ మెట్రిక్స్‌ను చూపిస్తుంది. దీనితో వినియోగదారులు తమ హార్ట్ రేట్, కాలొరీస్ ఖర్చు, మూవ్ రింగ్ ప్రోగ్రెస్ వంటి డేటాలను తక్షణమే చూడవచ్చు. అంతేకాక, హియరింగ్ ప్రొటెక్షన్, కన్వర్జేషన్ బూస్ట్, హియరింగ్ టెస్ట్ వంటి కొత్త ఫీచర్లతో వినియోగదారుల మరింత వినతగిన అనుభవాన్ని మెరుగుపరిచింది.
సూపర్ స్లిమ్ డిజైన్, 6.5-అంగుళాల ProMotion OLED డిస్‌ప్లేతో వచ్చేసిన iPhone Air..!
అలాగే ఇందులోని లైవ్ ట్రాన్సలేషన్ (బీటా) ఫీచర్ ద్వారా ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, పోర్చుగీస్, స్పానిష్ భాషల్లో హ్యాండ్-ఫ్రీ రియల్ టైం అనువాదం అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది చివర్లో ఇటాలియన్, జపనీస్, కొరియన్, చైనీస్ భాషలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ANC ఫీచర్ ఫోన్ కాల్స్ లో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తగ్గించి క్లియర్ సంభాషణలు అందిస్తుంది. ఇక ఆపిల్ సస్టైనబిలిటీను గమనించి AirPods Pro 3 ను రూపొందించింది. AirPods Pro 3 తెలుపు రంగులో రూ. 25,900 ధరతో భారత మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రీ-ఆర్డర్ సెప్టెంబర్ 12 నుంచి మొదలుకానుండగా.. సెప్టెంబర్ 19 నుంచి స్టోర్‌లలో అందుబాటులోకి రానుంది.