Apple iPhone 17 Pro and Pro Max Launched with A19 Pro Chip, Triple 48MP Cameras, iOS 26.. Price and Features are
Apple iPhone 17 Pro, Pro Max: ఐఫోన్ 17 సిరీస్ లో భాగంగా ఆపిల్ (Apple) సంస్థ నిర్వహించిన ‘Awe Dropping’ ఈవెంట్ లో ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ iPhone 17 Pro, Pro Max ను లాంచ్ చేసింది. ఈ మోడల్స్ అల్యూమినియం బాడీతో లాంచ్ అయ్యింది. ఇదివరకు iPhone 15 Pro, 16 Pro మోడల్స్ లో కనిపించిన టైటానియం బాడీతో పోలిస్తే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. ఇక ఈ మొబైల్స్ లో కొత్త డిజైన్ లో ఫుల్ విడ్త్ కెమెరా ప్లేటౌ వెనుక భాగంలో పొందుపరిచారు. ప్రత్యేకంగా ఈసారి ఆపిల్ తన ఫ్లాగ్‌షిప్ మోడల్‌లో పేపర్ ఛాంబర్ (Vapour Chamber) కూలింగ్ సిస్టమ్ ను తీసుక వచ్చింది. ఇది ఎక్కువ వర్క్ లోడ్స్ సమయంలో స్థిరమైన ప్రదర్శన అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
ఐఫోన్ 17 ప్రో లో 6.3 అంగుళాల Super Retina XDR OLED డిస్‌ప్లే ఉంది. ఇది ProMotion సపోర్ట్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి వుంటుంది. iPhone 17 Pro Maxలో 6.9 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఈ కొత్త ఆపిల్ డిజైన్డ్ సిరామిక్ షీల్డ్ 2 కోటింగ్ స్క్రీన్‌ను క్రాక్‌లు, స్క్రాచ్‌ల నుంచి 3 రెట్లు ఎక్కువ రక్షణను అందజేస్తుంది. ఇవి 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. ప్రాసెసింగ్ సామర్థ్యానికి సంబంధించిన విషయానికి వస్తే.. iPhone 17 Pro మోడల్స్ A19 Pro చిప్‌సెట్ తో పని చేస్తాయి. ఇది 6-కోర్ CPU, 6-కోర్ GPU ఆర్కిటెక్చర్ కలిగి ఉండగా, ప్రతి GPU కోర్‌లో న్యూరల్ ఆక్సిలేటర్స్ ఉంటాయి. ఆపిల్ ప్రకారం, ఇది ఇదివరకు ఐఫోన్ లతో పోలిస్తే 40% మెరుగైన పనితీరు అందిస్తుంది.
సూపర్ స్లిమ్ డిజైన్, 6.5-అంగుళాల ProMotion OLED డిస్‌ప్లేతో వచ్చేసిన iPhone Air..!
కెమెరా వ్యవస్థ:
Phone 17 Pro, iPhone 17 Pro Max మోడల్స్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వచ్చాయి. ఈ మూడు కెమెరాలు అన్ని 48 మెగాపిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంటాయి. ఇది ఇదివరకు iPhone మోడల్స్ తో పోలిస్తే మెరుగైన ఫోటోగ్రఫీ సామర్థ్యాన్ని అందిస్తుంది. ప్రధానంగా, 48 MP ఫ్యూజన్ ప్రైమరీ కెమెరా f/1.6 అపెర్చర్ మరియు Sensor-shift Optical Image Stabilisation (OIS) కలిగి ఉంటుంది. ఇది అధిక స్థిరమైన ఫోటోలు, వీడియోలు తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది.
అలాగే, 48 MP అల్ట్రావైడ్ కెమెరా మరింత పెద్ద దృశ్యాలను అందించనుంది. 48 MP టెలిఫోటో కెమెరా చివరిసారి 12 MP కంటే చాలా ఎక్కువగా అభివృధి చెందింది. ఇది 56% పెద్ద సెన్సార్‌తో, 8x ఆప్టికల్ జూమ్, 40x Digital Zoom మద్దతుతో మెరుగైన జూమ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇక ఫ్రంట్‌లో 18 MP సెంటర్ స్టేజి సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది ఆటోమేటిక్‌గా ఫోటోల ఫ్రేమింగ్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తూ.. మంచి సెల్ఫీలు, వీడియో కాలింగ్ అనుభవాన్ని అందజేస్తుంది.
ఆపరేటింగ్ సిస్టం:
ఈ రెండు మోడల్స్ iOS 26 తో వస్తాయి. ఇవి కొత్త లిక్విడ్ గ్లాస్ యూజర్ ఇంటర్‌ఫేస్, ఆపిల్ ఇంటలిజెన్స్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. లైవ్ ట్రాన్సలేషన్, ఫేస్ టైం, ఫోన్ అప్స్, విజువల్ ఇంటలిజెన్స్, కొత్త స్క్రీనింగ్ టూల్స్ కాల్స్, మెసేజింగ్ కోసం అందుబాటులోకి వచ్చాయి.
A19 చిప్, 48MP కెమెరా, iOS 26 ఫీచర్లతో Apple iPhone 17 లాంచ్.. ఫీచర్లు, ధరలు ఇలా!
బ్యాటరీ సామర్థ్యం:
యూని బాడీ డిజైన్ వల్ల పెద్ద బ్యాటరీ మాడ్యూల్ ఉండడం కారణంగా iPhone 17 Pro మోడల్స్, A19 Pro SoC వల్ల అధిక పవర్ ఎఫిషియెన్సీ కలిగి ఉంటాయి. ఆపిల్ ప్రకారం iPhone 17 Pro Max అత్యుత్తమ బ్యాటరీ లైఫ్ కలిగిన iPhone గా నిలుస్తోంది. అలాగే వీటిలో 50% ఛార్జింగ్ కేవలం 20 నిమిషాల్లో పూర్తవుతుంది. ఈ మొబైల్స్ సంబంధించి ఎలాంటి కచ్చితమైన బ్యాటరీ సామర్థ్యం సంస్థ ప్రకటించలేదు.
ధరలు:
iPhone 17 Pro అమెరికాలో 256GB స్టోరేజ్ $1,099 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే iPhone 17 Pro Max $1,199 నుంచి లభిస్తుంది. ఇక భారతదేశంలో iPhone 17 Pro ధర రూ.1,34,900 కాగా.. iPhone 17 Pro Max ధర రూ.1,49,900 నుంచి మొదలవుతుంది. ఈ రెండు మోడల్స్ కాస్మిక్ ఆరెంజ్, డీప్ బ్లూ, సిల్వర్ రంగుల్లో లభిస్తాయి. వీటికి సంబంధించి ప్రీ-ఆర్డర్ సెప్టెంబర్ 12 నుండి మొదలు కానుంది. అలాగే సెప్టెంబర్ 19 నుండి ప్రపంచవ్యాప్తంగా డెలివరీలు చేయబడుతాయి.