Leading News Portal in Telugu

Oppo A6 GT and oppo A6i Launched with Premium Specs, Affordable Prices.. full details of mobiles are


Oppo A6 GT, A6i: ఒప్పో (Oppo) కంపెనీ కొత్తగా Oppo A6 GT, Oppo A6i రెండు స్మార్ట్‌ఫోన్‌లను చైనాలో లాంచ్ చేసింది. ఇటీవల ప్రకటించిన Oppo A6 Pro తో పాటు.. ఇవి Oppo A-సిరీస్‌లో కొత్తగా చేరాయి. Oppo A6 GT ప్రీమియం స్పెసిఫికేషన్లు అందించగా, Oppo A6i సాధారణ వినియోగదారులకు తక్కువ ధరలో అందుబాటులోకి రానుంది. Oppo A6 GT ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు, భారీ బ్యాటరీతో ప్రీమియం వినియోగదారులకు.. Oppo A6i సాధారణ వినియోగానికి సరిపోయే విధంగా రూపొందించారు. తాజాగా చైనాలో లాంచ్ అయినా ఈ మొబైల్స్ త్వరలో మరిన్ని దేశాల్లో లాంచ్ కానున్నాయి. భారత మార్కెట్‌లో కూడా ఈ మొబైల్స్ కోసం వినియోగదారులు కూడా వేచి చూస్తున్నారు. మరి ఈ మొబైల్స్ ముఖ్య ఫీచర్లను ఒకసారి చూసేద్దామా..

Oppo A6 GT:
Oppo A6 GT డ్యూయల్ సిమ్ (nano + nano) ఫోన్ ColorOS 15 (Android 15 ఆధారంగా) పై పని చేస్తుంది. ఈ మొబైల్ 6.8 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ సాంప్లింగ్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. అలాగే ఈ మొబైల్ లో అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ సెక్యూరిటీకి సహాయపడుతుంది. ఇక ప్రాసెసర్ గా Snapdragon 7 Gen 3 చిప్‌సెట్, 8GB LPDDR4X RAM, 512GB UFS 3.1 స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇక మొబైల్ లో కెమెరాల్లో 50MP వైడ్-ఎంగిల్ (OIS మద్దతుతో), 2MP మోనోక్రోమ్ సెన్సార్, 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీకి 5G, Wi-Fi 6, Bluetooth 5.3, NFC, USB Type-C వంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇందులో 7,000mAh భారీ బ్యాటరీ, 80W సూపర్ ఫ్లాష్ చార్జింగ్ మద్దతుతో వస్తుంది.

Varun Tej & Lavanya : మెగా కుటుంబంలో కొత్త అతిథి.. వరుణ్ తేజ్-లావణ్యకు బేబీ బాయ్

Oppo A6i:
Oppo A6i కూడా ColorOS 15 ఆధారితంగా పనిచేస్తుంది. ఇందులో 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ సాంప్లింగ్ రేట్, 1,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంది. పవర్ కోసం Dimensity 6300 చిప్‌సెట్, 8GB LPDDR4X RAM, 256GB UFS 2.2 స్టోరేజ్ వేరియంట్ ఉంటుంది. కెమెరాల్లో 50MP వైడ్-ఎంగిల్, 2MP మోనోక్రోమ్ సెన్సార్, 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. అలాగే
కనెక్టివిటీ కోసం 5G, Wi-Fi 5, Bluetooth, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB Type-C వంటి కనెక్టివిటీ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇందులో 6,000mAh బ్యాటరీ, 45W సూపర్ ఫ్లాష్ చార్జింగ్ మద్దతుతో లభిస్తుంది.

ధరలు:
Oppo A6 GT ధర విషయానికి వస్తే.. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ CNY 1,699 (రూ.21,000) నుండి మొదలవుతుంది. అలాగే 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,799 (రూ.22,300)గా, 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ CNY 2,099 (రూ.26,000)కు లభిస్తుంది. ఈ మోడల్ రాక్ మిస్ట్ బ్లూ, స్ట్రిమార్ వైట్, కలర్ ఫుల్ పింక్ అనే మూడు రంగుల్లో అందుబాటులో ఉంది.

Tollywood : ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన టాలీవుడ్ దర్శకులు.. ఇప్పుడు హిట్ కోసం అష్టకష్టాలు..

ఇక Oppo A6i మొబైల్ 6GB RAM + 128GB స్టోరేజ్ ధర CNY 799 (రూ.9,900) నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఇతర వేరియంట్లు 8GB RAM + 128GB స్టోరేజ్ ధర CNY 999 (రూ.12,400), 8GB RAM + 256GB స్టోరేజ్ CNY 1,099 (రూ.13,600)గా నిర్ణయించారు. Oppo A6i తెలుపు, నలుపు రంగుల్లో లభిస్తుంది.