Leading News Portal in Telugu

Affordable 5G and Feature Phones HMD Vibe 5G, HMD 101 4G and 102 4G Launched in India


HMD Vibe 5G, HMD 101 4G,102 4G: ప్రముఖ మొబైల్ బ్రాండ్ HMD కొత్తగా మూడు ఫోన్లను లాంచ్ చేసింది. అవే HMD Vibe 5G, HMD 101 4G, HMD 102 4G మోడల్స్. ప్రజల విభిన్న అవసరాలు తీర్చడానికి HMD తన వివిధ రకాల మోడల్స్ ను తీసుక వస్తుంది. ఇకపోతే, HMD Vibe మొబైల్ 5G కనెక్టివిటీ కోసం సరసమైన ధరలో మంచి ఫీచర్లు కావాలనుకునే వినియోగదారుల కోసం బెస్ట్ ఛాయస్ కానుంది. ఈ ఫోన్ ద్వారా నెక్స్ట్ జెనరేషన్ మొబైల్ నెట్‌వర్క్ స్పీడ్స్ సౌకర్యం అందజేస్తుంది. దీనితో పాటు HMD రెండు కొత్త ఫీచర్ ఫోన్లను కూడా పరిచయం చేసింది. అవే.. HMD 101 4G అండ్ HMD 102 4G. వీటిని చిన్నగా, స్టైలిష్ డిజైన్ లో, 4G ఫీచర్స్ కలిపి తయారు చేశారు. మరి ఈ మొబైల్స్ సంగతేంటో ఒకసారి చూసేద్దామా..

HMD Vibe 5G:
HMD Vibe 5G లో 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే (720×1604 పిక్సెల్స్), 90Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఇది UNISOC T760 (6nm) ప్రొసెసర్‌తో పనిచేస్తుంది. ఈ మొబైల్ 4GB RAM + 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా.. మైక్రో SD ద్వారా 256GB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఇందులో 50MP రియర్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్‌ భాగంలో ఉంటుంది.

Image (6)

ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో Samsung Galaxy F17 5G లాంచ్!

వీటితోపాటు ఇందులో 3.5mm ఆడియో జాక్, స్టీరియో స్పీకర్లు, USB Type-C పోర్ట్ ఉన్నాయి. అలాగే కనెక్టివిటీకి Wi-Fi, Bluetooth 5.2, GPS + GLONASS, 5G బాండ్స్ (SA/NSA), డ్యూయల్ 4G VoLTE అందుబాటులో ఉన్నాయి. ఈ సామర్ ఫోన్ 5000mAh బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఆండ్రాయిడ్ 15 OS ఆధారంగా 2 సంవత్సరాల క్వార్టర్లీ సెక్యూరిటీ అప్‌డేట్లు కూడా అందుతాయి.

HMD 101 4G & HMD 102 4G:
ఈ రెండు ఫీచర్ ఫోన్లు 2 అంగుళాల QQVGA డిస్‌ప్లే (240×320 pixels) కలిగి ఉంటాయి. ఇందులో Unisoc 8910 FF ప్రాసెసర్, 16MB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నా.. మైక్రోSD ద్వారా 32GB వరకు పెంచుకోవచ్చు. అలాగే ఇవి S30+ RTOS ఆధారంగా పనిచేస్తాయి. HMD 102 4G మోడల్‌లో మాత్రమే QVGA కెమెరా, ఫ్లాష్ కలిగి ఉంది. ఈ ఫోన్‌లు FM రేడియో, MP3 ప్లేయర్, క్లౌడ్ అప్స్, లోకల్ లాంగ్వేజ్ సపోర్ట్, బ్లూటూత్ 5.0, USB Type-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్, డస్ట్ అండ్ స్ప్లాష్ ప్రూఫ్ (IP52 రేటింగ్) సదుపాయాలతో వస్తాయి. వీటిలో 1000mAh బ్యాటరీ కెపాసిటీ ఉండి తీసి మార్చుకునేందుకు వీలుగా ఉంటుంది.

OG : ప్రమోషన్లకు పవన్ దూరంగా ఉంటాడా.. అసలు కారణం అదే..

Image (4)

ధరలు:
HMD Vibe 5G ఫోన్ బ్లాక్, పర్పుల్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఫెస్టివ్ స్పెషల్ ధరగా దీని ధర రూ.8,999కగా నిర్ణయించారు. ఇక HMD 101 4G మోడల్‌ను డార్క్ బ్లూ, రెడ్, బ్లూ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ఇక వీటి ధరను రూ.1,899గా నిర్ణయించారు. అలాగే HMD 102 4G మోడల్ డార్క్ బ్లూ, రెడ్, పర్పుల్ రంగుల్లో లభిస్తుంది. దీని ధరను రూ.2,199గా నిర్ణయించారు. ఈ కొత్త మొబైల్స్ అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్లు, ప్రధాన ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్లు, HMD వెబ్ సైట్ ద్వారా ఈ రోజు నుండి అందుబాటులోకి రానున్నాయి.

Image (3)