Leading News Portal in Telugu

YouTube Expands Multi-Language Audio Feature for Content Creators.. Global Reach Made Easy


Youtube: ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫార్మ్ యూట్యూబ్ (YouTube) ఇప్పుడు మల్టీ-లాంగ్వేజ్ ఆడియో ఫీచర్‌ను మరింత విస్తరించినట్లు ప్రకటించింది. దీనితో ఇప్పుడు కోట్ల మంది క్రియేటర్ల కోసం అందుబాటులోకి వస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వీడియోలను స్థానిక భాషల్లో అందించడం చాలా సులువు కానుంది. దీనితో కంటెంట్ క్రియేటర్లు తమ కంటెంట్‌ను మరింత ఎక్కువ వ్యూయర్స్ కు చేరవేయగలుగుతారు.

ఈ ఫీచర్ తో.. ఒక క్రియేటర్ వారి భాషలో వీడియోను అప్లోడ్ చేస్తే.. మిగితా దేశాలలో వీక్షకులు తమ సొంత భాషలో వీడియోను వీక్షించొచ్చు. మల్టీ-లాంగ్వేజ్ ఆడియో ట్రాక్స్‌ను జతచేసిన క్రియేటర్లు, సాధారణంగా తమ వీడియో వీక్షణలో 25% వరకు ఇతర భాషల్లోనూ వచ్చిన వ్యూస్ ను పొందుతున్నారు. ఈ ఫీచర్ రెండు సంవత్సరాల క్రితం చిన్న స్థాయిలో పైలట్ ప్రోగ్రామ్ గా ప్రారంభమైంది. ఆ సమయంలో వివిధ భాషల్లో డబ్ చేయడానికి దీనిని కొద్దీ మంది క్రియేటర్లకు మాత్రమే అనుమతించారు.

Amarnath : సైకో కంటే పెద్ద పేరు ఏదైనా ఉంటే అది చంద్రబాబే

ఓ ఛానల్‌లో మల్టీ-లాంగ్వేజ్ ఆడియో వాడడం వలన వ్యూస్ మూడు రెట్లు పెరిగాయి. ప్రపంచంలోని ప్రముఖ క్రియేటర్లు ఈ ఫీచర్‌ను ఉపయోగించి తమ కంటెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరవేస్తున్నారు. కొందరైతే వారి వీడియోకి 30కి పైగా భాషల్లో డబ్బింగ్ చేసి వారి వీడియోలు అందజేస్తున్నారు.

యూట్యూబ్ ఈ ఫీచర్‌ను త్వరలో మరికొంతమంది క్రియేటర్లకు అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, యూట్యూబ్ ప్రస్తుతం మల్టీ-లాంగ్వేజ్ థంబ్ నెయిల్స్ (Localized Thumbnails) పై కూడా ప్రయోగాలు చేస్తోంది. దీని ద్వారా, వీడియో వీక్షించే వ్యూయర్ ఎంచుకున్న భాష ప్రకారం థంబ్ నెయిల్స్ కూడా స్థానికీకరించి చూపిస్తాయి. ఈ మల్టీ-లాంగ్వేజ్ ఆడియో ఫీచర్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రియేటర్లు తమ కంటెంట్‌ను మరింత ఎక్కువగా షేర్ చేయగలుగుతున్నారు. భిన్న భాషల ప్రేక్షకులతో బలమైన సంబంధాన్ని ఏర్పరచడం, కంటెంట్ రీచ్‌ను పెంచడం, అంతర్జాతీయ మార్కెట్లో పోటీ సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం ఇది మంచి మార్గంగా నిలుస్తుంది.

Allu Arjun : బన్నీ చేసిన పని.. విజయ్ కు కెరీర్ ను మార్చేసిందంట..