- ఐఫోన్ లవర్స్‌కి గుడ్‌న్యూస్
- ఐఫోన్ 16 ప్రోపై రూ.43 వేల తగ్గింపు
- బ్యాంక్ ఆఫర్ కూడా అదనంగా వర్తిస్తుందా?
యాపిల్ కంపెనీ ఐఫోన్ 17 సిరీస్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. 17 సిరీస్ రిలీజ్ నేపథ్యంలో పాత సిరీస్ ఐఫోన్ల ధరలను యాపిల్ తగ్గించింది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం తక్కువ ధరకే అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఈ-కామర్స్ వెబ్సైట్ ‘ఫ్లిప్‌కార్ట్’ తన బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025లో ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందించనుంది. దాంతో మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకు ఐఫోన్ లభించనుంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి తెలుసుకుందాం.
సెప్టెంబర్ 23న ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్కు ముందు కొన్ని డీల్ వివరాలు టీజ్ చేయబడ్డాయి. సేల్ సందర్భంగా ఐఫోన్ 16 ప్రో ధర భారీగా తగ్గనుంది. సేల్ సమయంలో రూ.69,999కి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ధర రూ.1,12,900గా ఉంది. అంటే మీకు రూ.42,901 తగ్గింపును అందిస్తుంది. ఇది పెద్ద ఆఫర్ అనే చెప్పాలి. బ్యాంక్ ఆఫర్లు లేకుండానే ఈ ధరకు లభిస్తుందా?.. లేదా బ్యాంక్ ఆఫర్ కూడా అదనంగా వర్తిస్తుందా? అనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ఒకవేళ బ్యాంక్ ఆఫర్ కూడా ఉంటే ఐఫోన్ 16 ప్రో ధర మరింతగా తగ్గనుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ అయితే ఎలాగూ ఉంటుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఐఫోన్ 16 (128జీబీ స్టోరేజ్ వేరియంట్) ధర రూ.74,900గా ఉంది. దీనిపై కూడా భారీ డిస్కౌంట్ ఉంది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా రూ.51,999కే అందుబాటులోకి రానుంది. అంటే మీరు 23 వేలు ఆదా చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్ (ఒకవేళ ఉంటే), ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా ఐఫోన్ 16 మరింత చౌకగా లభించనుంది. మరోవైపు ఐఫోన్ 16 ప్రో మాక్స్‌ను రూ.90,000 లోపు విక్రయించనున్నట్లు సమాచారం. ఇది యాపిల్ లవర్స్ ఎగిరి గంతేసే న్యూస్ అనే చెప్పాలి.