Leading News Portal in Telugu

POCO M7 Plus 5G 4GB Limited Edition Launched in India.. Full Specs, Features & Launch Date


POCO M7 Plus 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో (POCO) తన ప్రీమియం మిడ్ రేంజ్ ఫోన్ POCO M7 Plus 5G కొత్త 4GB లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ ను భారత్‌లో విడుదల చేసింది. గత నెలలో POCO M7 Plus 5G 6GB, 8GB RAM వేరియంట్ లను లాంచ్ చేసిన తరువాత ఈ కొత్త 4GB వెర్షన్ విడుదల చేయడం వినియోగదారులకు మరింత ఎకానమీ ఆప్షన్ నుఅందిస్తోంది. ఈ కొత్త వేరియంట్ మిగతా స్పెసిఫికేషన్స్ పరంగా పూర్తిగా సమానం. మరి ఆ పూర్తి వివరాలను చూద్దామా..

Sony Xperia 10 VII విడుదల.. పూర్తి వివరాలు, ధర, స్పెసిఫికేషన్స్ ఇలా!

POCO M7 Plus 5G స్పెసిఫికేషన్స్:
ఈ స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల FHD+ (2340 x 1080 పిక్సెల్స్) LCD స్క్రీన్ తో వస్తోంది, 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు 850 నిట్స్ (హై బ్రైట్‌నెస్ మోడ్) పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఇక ఇందులో Qualcomm Snapdragon 6s Gen 3 6nm 5G SoC ప్రాసెసర్, 900MHz Adreno 619 GPU కలిగి ఉంది. ఇక మెమరీ ఎంపికల్లో 4GB, 6GB, 8GB LPDDR4X ర్యామ్ ఉంటాయి. అలాగే 128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రో SD ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు. ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 OS, హైపర్ OS UI పై పనిచేస్తుంది.

POCO M7 Plus 5G లో 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, LED ఫ్లాష్ తోపాటు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండటం ద్వారా మంచి ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుంది. 7000mAh (టిపికల్) భారీ బ్యాటరీతో పాటు 33W ఫాస్ట్ ఛార్జింగ్, 18W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఇక 5G నెట్‌వర్క్ (n1/n3/n5/n8/n28/n40/n78 బ్యాండ్లు), డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6 (802.11 ac), బ్లూటూత్ 5.1, GPS + GLONASS, USB Type-C పోర్ట్ వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే మొబైల్ IP64 ధూళి, స్ప్లాష్ రేసిస్టెంట్‌గా రూపొందించబడింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్ కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి.

Rajasab : వి‌ఎఫ్‌ఎక్స్‌తో మ్యాజిక్ చేసిన మిరాయ్.. రాజా సాబ్‌ మీద హ్యారీ పోటర్ రేంజ్ హోప్స్ !

POCO M7 Plus 5G కొత్త 4GB లిమిటెడ్ ఎడిషన్ ‘POCO Festive MADness’ క్యాంపెయిన్ కింద లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఫస్ట్ సేల్ సెప్టెంబర్ 23 నుండి ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే జరుగుతుంది. అయితే ఫ్లిప్ కార్ట్ ప్రకారం ఈ POCO M7 Plus 5G మోడల్ సెప్టెంబర్ 15న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయబడుతుంది. అప్పుడు ధర వివరాలు కూడా ప్రకటించనున్నారు.