Leading News Portal in Telugu

Sony Xperia 10 VII Launched Globally.. Full Specs, Price, Features & Release Details


Sony Xperia 10 VII: ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీలలో ఒకటైన సోనీ (Sony) సంస్థ తాజాగా Sony Xperia 10 VII స్మార్ట్‌ఫోన్ ను గ్లోబల్ గా కొన్ని మార్కెట్లలో విడుదల చేసింది. చూడడానికి కాస్త స్లిమ్ గా, స్టైలిష్ గా ఉండే ఈ మొబైల్ యూత్ ను టార్గెట్ చేసినట్లుగా అనిపిస్తోంది. మరి ఈ స్టైలిష్ మొబైల్ పూర్తి వివరాలు ఒక్కక్కటిగా చూసేద్దామా..

Sony Xperia 10 VII అత్యాధునిక Android 15 OS తో పని చేస్తుంది. ఈ కొత్త మొబైల్ 6.1 అంగుళాల OLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1080×2340 పిక్సెల్ ఫుల్ HD+ రిజల్యూషన్, అలాగే 100% DCI-P3 కలర్ గామట్ తో వస్తుంది. అలాగే మొబైల్ ముందు ప్యానెల్ Corning Gorilla Glass Victus 2 తో రక్షణ కలిగి ఉంది. ఇక ఈ మొబైల్ Snapdragon 6 Gen 3 చిప్‌సెట్ పై పనిచేస్తుంది. ఇది 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. అంతేకాకుండా, మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకోవచ్చు. అలాగే ఇందులో 5,000mAh బ్యాటరీ వస్తుంది.

SBI: ఎస్బీఐ బ్యాంకులో మరో మోసం.. నాణ్యత లేని బంగారం భద్రపరచి రూ. 23 లక్షలు తీసుకున్న వైనం

Sony Xperia 10 VII లో శక్తివంతమైన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్ (f/1.9) Exmor RS సెన్సార్ తో 1/1.56 అంగుళాల సైజును కలిగి ఉంది. ఇది 24mm ఫోకల్ లెన్త్, 84 డిగ్రీ వ్యూ ఆఫర్ చేస్తుంది. సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్ (f/2.4) 1/3 అంగుళ సెన్సార్ తో 16mm ఫోకల్ లెన్త్, 123 డిగ్రీ వైడ్ యాంగిల్ ను అందిస్తుంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ (f/2.0) 1/4 అంగుళ సెన్సార్ తో 26mm ఫోకల్ లెన్త్, 78 డిగ్రీ వ్యూ కలిగి ఉంది.

Image

ఇక కనెక్టివిటీ విషయంలో.. Sony Xperia 10 VII ఆధునిక ఫీచర్లను అందిస్తుంది. ఇందులో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi 6E, బ్లూటూత్ 5.4, NFC, గూగుల్ క్యాస్ట్ వంటి ఆధునిక టెక్నాలజీలు ఉన్నాయి. అదనంగా ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫోన్‌ను వేగంగా, సురక్షితంగా అన్‌లాక్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే ఈ మొబైల్ లో IP65, IP68 రేటింగ్స్ ఫోన్‌ను ధూళి, నీటి నిరోధకతతో రక్షణను అందిస్తాయి. Sony Xperia 10 VII కొలతలు 153×72×8.3 మిల్లీమీటర్లు ఉండగా, బరువు 168 గ్రాములుగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ వైట్, టుర్క్ వోయిస్, చారికోల్ బ్లాక్ అనే మూడు ఆకర్షణీయ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ప్రీ-ఆర్డర్ సెప్టెంబర్ 12 నుండి సోనీ అధికారిక రిటైల్ స్టోర్లలో, వెబ్‌సైట్ ద్వారా చేయొచ్చు.

Charlie Kirk: భర్త వారసత్వాన్ని కొనసాగిస్తా.. చార్లీ కిర్క్ భార్య ఎరికా భాగోద్వేగ ప్రసంగం

ఇక ధర విహాయనికి వస్తే.. Sony Xperia 10 VII ప్రారంభ ధర EUR 399 (రూ. 42,000) నుండి ఉండగా, UK లో GBP 449 (రూ. 47,000) గా లభిస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ UK, యూరోపియన్ యూనియన్ (EU), జపాన్ లాంటి కొన్ని ప్రత్యేక మార్కెట్లలో మాత్రమే విడుదల అవుతోంది. భారత్‌లో దీని విడుదల జరగకపోవడం గమినించతగ్గ విషయం. ఎందుకంటే, సోనీ ఇప్పటికే భారత మార్కెట్ నుండి తమ స్మార్ట్‌ఫోన్ వ్యాపారాన్ని నిలిపివేసింది.