- అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ 2025
- సెప్టెంబర్ 23 నుంచి సేల్ ఆరంభం
- షావోమీ 14 సీవీపై 16499 వేల తగ్గింపు
Buy Xiaomi 14 Civi Dead Cheap in Amazon Great Indian Festival 2025: ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ 2025 త్వరలో ఆరంభం కానుంది. సెప్టెంబర్ 23 నుంచి ఈ సేల్ ప్రారంభమవుతుంది. మీరు ప్రైమ్ మెంబర్ అయితే.. ఒక రోజు ముందుగానే సేల్‌కు యాక్సెస్ పొందుతారు. ఈ సేల్‌లో మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకు కొన్ని ఫోన్స్ లభించనున్నాయి. ఆ జాబితాలో ఆకర్షణీయమైన, శక్తివంతమైన ‘షావోమీ 14 సీవీ’ కూడా ఉంది. ఈ ఫోన్‌పై ఎలాగా 16 వేల తగ్గింపు లభించనుంది. ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం.
14 సీవీ మొబైల్‌ను షావోమీ గతేడాది జూన్‌లో రిలీజ్ చేసింది. ఆ సమయంలో 8జీబీ + 256జీబీ వేరియంట్‌ను రూ.42,999 ధరకు విడుదల చేసింది. త్వరలో ఆరంభమయ్యే అమెజాన్ సేల్‌లో వేల రూపాయల తగ్గింపుతో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.27,999కి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ ఆఫర్ అదనగంగా ఉంది. బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ.26,499కు మీకు లభిస్తుంది. అన్ని ఆఫర్ల తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.16,499 తగ్గింపు లభిస్తుంది. ఇది మంచి డీల్ అనే చెప్పాలి.
షావోమీ 14 సీవీ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన డిజైన్, అద్భుతమైన డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, గొప్ప కెమెరా సిస్టమ్‌తో వచ్చింది. ఈ ఫోన్ 6.55 ఇంచెస్ 1.5K కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్‌ఓఎస్,120Hz రిఫ్రెష్ రేటు, 240Hz టచ్‌శాంప్లింగ్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50 ఎంపీ ఓఐఎస్ కెమెరా, 50 ఎంపీ టెలిఫొటో, 12 ఎంపీ అల్ట్రావైడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీ కోసం రెండు 32 ఎంపీ కెమెరాలు ఉంటాయి. 4700 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ, 67 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.