Vivo Y31 5G, Y31 Pro 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో (Vivo) కొత్తగా Y31 5G, Y31 Pro 5G అనే రెండు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. మిడ్ రేంజ్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకొని రూపొందించిన ఈ ఫోన్లు ప్రత్యేకమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మరి ఎలాంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయో విరివిరిగా చూద్దామా..
Jharkhand Encounter : హజారీబాగ్ ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్ట్ అగ్రనేతలు మృతి
Vivo Y31 5G:
Vivo Y31 5G మొబైల్ గత ఏడాది విడుదలైన Y29 మొబైల్ కి అప్డేటెడ్ వర్షన్. ఇది వరకు మోడల్ కంటే కొత్తగా వచ్చిన మొబైల్ లో సాంకేతికత, మెరుగైన బ్యాటరీ, మెరుగైన రిజిస్టెన్స్ అందిస్తున్నారు. ఇక ఈ Vivo Y31 5G మొబైల్ లో 6.68 అంగుళాల 120Hz రిఫ్రెష్ రేట్ ఎల్సీడి స్క్రీన్, 1000 నిట్స్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇది Dimensity 6300 ప్రాసెసర్ ను కలిగి ఉంది.
ఇక ఈ మొబైల్ 4GB లేదా 6GB RAM, 128GB స్టోరేజ్ కలిగి ఉంది. ఇక ఇందులో ప్రధానంగా చెప్పుకోతగ్గ విషయం ఏంటంటే.. 6500mAh భారీ బ్యాటరీ. దీనికి 44W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అలాగే మరో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది IP68 + IP69 రేటింగ్స్ ఉన్న ఈ ఫోన్ ట్రిపుల్ లేయర్ వాటర్ రెసిస్టెన్స్ డిజైన్ కలిగి ఉండటం వల్ల మరింత భద్రతను అందిస్తుంది.
ఇక కెమెరా విషయానికి వస్తే.. 50MP మెయిన్ రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు. అలాగే స్టెరియో స్పీకర్స్, USB Type-C ఆడియో, 5G SA/NSA కనెక్టివిటీ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ మొబైల్ 4GB + 128GB వేరియంట్ రూ.14,999 కాగా, 6GB + 128GB వేరియంట్ రూ. 16,499 గా నిర్ణయించారు.
Adireddy Vasu: మాజీ సీఎం జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు..
Vivo Y31 Pro 5G:
Vivo Y31 Pro 5Gలో 6.72 అంగుళాల ఫుల్ HD+ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1050 నిట్స్ బ్రైట్నెస్ కలిగి ఉంది. ఇది MediaTek Dimensity 7300 4nm ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. ఇక ఇందులో 8GB LPDDR4x ర్యామ్, 128GB లేదా 256GB (UFS 3.1) స్టోరేజ్ కలిగి ఉంది. ఇక ఇది ఆండ్రాయిడ్ 15 OS తో OriginOS 15 అనుభవాన్ని అందిస్తుంది. ఈ మొబైల్ లో 50MP రియర్ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్, 8MP ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి.
ఇక 6500mAh బ్యాటరీ ఉండగా.. 44W ఫాస్ట్ చార్జింగ్ కలిగి ఉంది. అలాగే ఇందులో MIL-STD-810H కంప్లయంట్, IP64 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్, స్టెరియో స్పీకర్స్ వంటి ఇతర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. Vivo Y31 Pro 5G 8GB + 128GB వేరియంట్ రూ. 18,999 కాగా, 8GB + 256GB వేరియంట్ రూ. 20,999గా ధరలు నిర్ణయించారు. ఈ కొత్త స్మార్ట్ఫోన్లు అమెజాన్, వివో ఇండియా ఆన్లైన్ స్టోర్, అన్ని ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.
ఇక లాంచ్ ఆఫర్స్ కింద.. Vivo Y31 5Gపై రూ. 1000 వరకు బ్యాంక్ ఆఫర్, Vivo Y31 Pro 5Gపై రూ. 1500 వరకు బ్యాంక్ ఆఫర్ అందిస్తున్నారు. అలాగే వీటికి 3 నెలల నో-కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంది.