Samsung Galaxy S25 FE (Fan Edition): శాంసంగ్ మిడ్ రేంజ్ S సిరీస్ ఫోన్ Galaxy S25 FE (Fan Edition)ను లాంచ్ చేసింది. గత వారం గ్లోబల్ లాంచ్ తర్వాత ఇప్పుడు భారత్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. మరి ఈ కొత్త మొబైల్ ఫీచర్స్, ధరలు ఏంటో పూర్తిగా చూసేద్దామా..
Samsung Galaxy S25 FE ఆండ్రాయిడ్ మొబైల్ 6.7 అంగులా FHD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణతో ఉంటుంది. ఈ మొబైల్ ప్రముఖ Exynos 2400 4nm SoCతో పని చేస్తుంది. ముందు మోడల్స్ తో పోల్చితే ఇది 10% పెద్ద వేపర్ ఛాంబర్ కలిగి ఉండటం వల్ల మొబైల్ ను చల్లపరిచే సామర్థ్యం మెరుగుపడింది. ఫోన్ Android 16 ఆధారంగా One UI 8 తో పనిచేస్తుంది. Samsung S25 సిరీస్ ఫోన్ల లాగే ఇది 7 సంవత్సరాల ఆండ్రాయిడ్, సెక్యూరిటీ అప్డేట్లు అందిస్తుంది.
5-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్ ఉన్న Maruti Suzuki Victoris ధరలు వచ్చేశాయ్.. రూ.10.50 లక్షల నుండి మొదలు!
ఇక ఇందులో కెమెరా విషయానికి వస్తే.. 50MP ప్రైమరీ రియర్ కెమెరా (f/1.8, OIS), 12MP 123° అల్ట్రా వైడ్ కెమెరా (f/2.2), 8MP టెలిఫోటో కెమెరా (f/2.4, OIS, 3X ఆప్టికల్ జూమ్) లతో పాటు 12MP ఫ్రంట్ కెమెరా (f/2.2) కలిగి ఉంది. ఈ మొబైల్ గ్లాస్ బ్యాక్, ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ కలిగి ఉంది. అలాగే ఇది IP68 రేటింగ్ (డస్ట్ & వాటర్ రెసిస్టెంట్) కల్గి ఉంది. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో USB Type-C ఆడియో, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యుయల్ సిమ్, 5G SA/NSA, 4G VoLTE, Wi-Fi 6E, Bluetooth 5.4, GPS + GLONASS, NFC వంటివి ఉన్నాయి.
ఇక ఈ మొబైల్ 4,900mAh బ్యాటరీ మాత్రమే కలిగి ఉంటుంది. ఇక దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందుబాటులో ఉంటుంది. మొబైల్ 161.3×76.6×7.4 mm సైజు ఉండగా.. బరువు 190గ్రాములు మాత్రమే ఉంది. Samsung Galaxy S25 FE నేవీ, జెట్ బ్లాక్, వైట్ అనే మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
Israel Offer: ఇజ్రాయెల్ ఆఫర్‌కు భారత్ ఓకే చెప్తే.. పాక్ కథ ఎప్పుడో ముగిసేది!
ఇక ధర విషయానికి వస్తే.. 8GB + 128GB వేరియంట్ రూ.59,999 కాగా, 8GB + 256GB వేరియంట్ రూ.65,999, 8GB + 512GB వేరియంట్ రూ.77,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 29 నుండి శాంసంగ్, శాంసంగ్ ఎక్సక్లూసివ్ స్టోర్స్, కొన్ని శాంసంగ్ అధికారిక రిటైల్ స్టోర్స్, ఇతర ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. ఇక లాంచ్ ఆఫర్ల విషయానికి వస్తే.. స్టోరేజ్ అప్‌గ్రేడ్ ఆఫర్ కింద రూ. 12,000 లకు (256GB కొనుగోలు చేస్తే 512GB) పొందవచ్చు. ఇక రూ.5,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్, 24 నెలల వరకు నో కాస్ట్ EMI ఆఫర్ లభించనున్నాయి.