Flipkart Big Billion Days 2025: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్-2025 సెప్టెంబర్ 23న అధికారికంగా ప్రారంభం కానుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ (Flipkart Plus), ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ (Flipkart Black) సభ్యులకు ఈ సేల్ సెప్టెంబర్ 22 నాడే ముందుగా అందుబాటులోకి రానుంది. ఇక సేల్‌లో భాగంగా తాజగా మోటోరోలా (Motorola) తమ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ప్రకటించింది. మరి ఆ ఆఫర్స్ ఏంటో పూర్తిగా చూసేద్దామా..
IP68 + IP69 రేటింగ్స్, 6500mAh బ్యాటరీ, స్టెరియో స్పీకర్స్‌తో Vivo Y31 5G, Y31 Pro 5G స్మార్ట్‌ఫోన్స్ లాంచ్!
Motorola స్మార్ట్ఫోన్ల ప్రత్యేక ఆఫర్లు:
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో మోటోరోలా ఫ్లాగ్షిప్, మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్లు భారీ తగ్గింపు ధరల్లో లభిస్తాయి. ముఖ్యంగా మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ వివిధ వేరియంట్లపై ప్రత్యేక ఆఫర్లు ఇలా ఉన్నాయి. 8GB + 256GB వేరియంట్‌ను రూ. 29,999కి బదులుగా రూ. 24,999కి, 12GB + 256GB వేరియంట్‌ను రూ. 30,999 బదులుగా రూ. 28,999కి, అలాగే 16GB + 512GB వేరియంట్‌ను రూ. 34,999 బదులుగా రూ. 32,999కి కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా, మోటోరోలా రేజర్ 60 (8GB + 256GB) మోడల్ అసలు ధర రూ. 49,999 కాగా కేవలం రూ. 39,999కి సేల్ సమయంలో కొనొచ్చు.
ఇతర ప్రముఖ మోటోరోలా స్మార్ట్ఫోన్ల ఆఫర్లల వివరాలు చూస్తే.. Moto G96 5G (8GB+128GB) వేరియంట్‌ను రూ. 19,999 బదులుగా రూ. 16,999కి, Moto G86 Power మోడల్‌ను రూ. 19,999 బదులుగా రూ. 17,999కి, Motorola Edge 60 Stylus ను రూ. 22,999 బదులుగా రూ. 19,999కి అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా, Moto G85 5G (8+128GB) మోడల్ రూ. 17,999 బదులుగా రూ. 14,999కి, Moto G45 5G (8+128GB) మోడల్ రూ. 12,999 బదులుగా రూ. 10,999కి, Moto G35 5G (4+128GB) మోడల్‌ను రూ. 9,999 బదులుగా రూ. 8,999కి కొనుగోలు చేయవచ్చు.
AV Ranganath : నాలాపై ఉన్న 145 ఇళ్లు.. అడ్డుగా ఉన్న ఇళ్లు తొలగిస్తాం..!
ఈ సేల్‌లో ఇయర్ ఫోన్స్, టాబ్లెట్స్, ల్యాప్ టాప్స్, ఇతర గాడ్జెట్లపై కూడా భారీ తగ్గింపులు అందుబాటులో ఉంటాయి. ఇందులో భాగంగా Motorola Buds Loop ఇయర్ ఫోన్స్ అసలు ధర రూ. 7,999 బదులుగా రూ. 5,999కి, Moto Buds Bass ఎయిర్ఫోన్స్ను రూ. 2,499 బదులుగా రూ. 1,999కి కొనుగోలు చేయొచ్చు. Motorola Smart TV కూడా అసలు ధర రూ. 9,199 బదులుగా రూ. 8,644కి అందుబాటులోకి వస్తుంది. అలాగే, మోటోరోలా వాషింగ్ మెషిన్ ను రూ. 21,490 బదులుగా రూ. 19,890కి కొనవచ్చు. ఇంకా Moto Pad 60 Pro ట్యాబ్లెట్‌ను రూ. 28,999 బదులుగా రూ. 21,499కి, Moto Book 60 ల్యాప్‌టాప్‌ను రూ. 49,900 బదులుగా రూ. 30,900కి, Moto Book 60 Pro ల్యాప్‌టాప్‌ను రూ. 60,990 బదులుగా రూ. 54,990కి సేల్ సమయంలో కొనవచ్చు.
The Big Billion Moto Rush is here with unbeatable prices on Motorola devices, only on Flipkart. After the Naacho Naacho anthem, it’s time for more. Say goodbye to outdated phones and hello to the Bye Bye Old Phone Hello Moto Contest, launching tomorrow.
— Motorola India (@motorolaindia) September 13, 2025