- ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025
- ‘ప్రీ-రిజర్వ్ పాస్’ను తీసుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్
- అతి తక్కువ ధరకు ఐఫోన్ 16 మీ సొంతం
బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025లో ఐఫోన్ 16 సిరీస్‌పై ఇప్పటికే భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. తాజాగా కొనుగోలుదారులకు ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లను ముందస్తుగా రిజర్వ్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. ఇందుకు ‘ప్రీ-రిజర్వ్ పాస్’ను ఫ్లిప్‌కార్ట్ తీసుకొచ్చింది. పాస్ కొనుగోలు చేసిన వారు సేల్‌లో మొదటి 24 గంటల్లో ప్రో, ప్రో మాక్స్‌లను పొందవచ్చు. ఐఫోన్‌కు ఫుల్ క్రేజ్ కారణంగానే ఈ ఫ్లిప్‌కార్ట్ దీనిని ప్రవేశపెట్టింది. అంతేకాదు డిస్కౌంట్స్ కూడా ఉండనున్నాయి. అది ఎంత అన్నది మాత్రం వెల్లడించలేదు.
ప్రీ-రిజర్వ్ పాస్‌లు సోమవారం (సెప్టెంబర్ 15) మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులోకి వచ్చాయి. ఆసక్తిగల వారు పాస్‌లను ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు కొనుగోలు చేయవచ్చు. పాస్ ధర రూ.5000. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే.. ఈ పాస్ రద్దు కాదు. అయితే మీరు కొనే ఐఫోన్ తుది ధర నుంచి ఈ పాస్ ధర తీసివేయబడుతుంది. ఈ పాస్ మొదటి 24 గంటలు మాత్రమే చెల్లుతుంది. ఒక కస్టమర్ ఒక పాస్‌ను మాత్రమే కొనుగోలు చేయగలరు. పాస్ కొనుగోలు చేసిన తర్వాత వినియోగదారులు ఫోన్ పొందకపోతే.. డబ్బును తిరిగి చెల్లించే అవకాశం ఉంది.
ఐఫోన్ 16 ప్రో 128 జీబీ, 256 జీబీ వేరియంట్లతో సహా ఐఫోన్ 16 ప్రో మాక్స్ 256 జీబీ వేరియంట్లకు ప్రీ-రిజర్వ్ పాస్‌లు అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో ఐఫోన్‌కు ఫుల్ క్రేజ్ ఉంది. అయితే ఎర్రర్ కారణంగా కొనుగోలు చేయలేకపోతున్నామని చాలా ఫిర్యాదు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పాస్‌లను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రీ-రిజర్వ్ పాస్ కొనడానికి వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ కేటగిరీలు > మొబైల్స్ > ఐఫోన్ > ఐఫోన్ 16 ప్రో | ప్రో మాక్స్ > ప్రీ-రిజర్వ్ పాస్‌కి వెళ్లాలి.
ఇటీవల ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మాక్స్‌ల ధరలు వరుసగా రూ.69999, రూ.89999 నుంచి ప్రారంభమవుతాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. లాంచ్ సమయంలో వాటి ధర రూ.112900, రూ.139900గా ఉంది. అంటే 37 శాతం, 35 శాతం తగ్గింపులభిస్తుంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఇది బెస్ట్ డీల్లుగా చెప్పొచ్చు. కొనుగోలుదారులు ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కలిగి ఉంటే.. అదనంగా రూ.5000 తగ్గింపు పొందవచ్చు. సెల్ సమయంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా అతి తక్కువ ధరకు ఐఫోన్ 16 మీ సొంతం అవుతుంది.