Leading News Portal in Telugu

Redmi 15R 5G Launched with 12GB RAM, 6,000mAh Battery, IP64 Rating, and 120Hz Display


Redmi 15R 5G:రెడ్‌మీ 15R 5G హ్యాండ్‌సెట్‌ను చైనాలో లాంచ్ చేశారు. ఈ కొత్త ఫోన్ మొత్తంగా నాలుగు రంగుల ఎంపికలలో, అలాగే 5 వేర్వేరు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 6,000mAh బ్యాటరీతో పాటు 33W ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇది ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో గరిష్టంగా 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఉన్నాయి. రెడ్‌మీ 15R 5G 6.9 అంగుళాల డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా ఇది దుమ్ము, నీటి నిరోధకత కోసం IP64 రేటింగ్‌ను కలిగి ఉంది.

Little Hearts : ఆ విషయంలో మౌళిని చూసి మిగతా హీరోలు నేర్చుకోవాల్సిందే..

రెడ్‌మీ 15R 5G మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 ఇంటర్‌ఫేస్‌పై పనిచేస్తుంది. ఇందులో 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే, 720×1,600 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, ఇంకా 810 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉన్నాయి. ఈ డిస్‌ప్లే బ్లూ లైట్ ఎమిషన్స్ కోసం TUV రైన్‌ల్యాండ్ ధృవీకరణ పొందింది. రెడ్‌మీ 15R 5G ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పాటు, 12GB LPDDR4X ర్యామ్, గరిష్టంగా 256GB UFS 2.2 స్టోరేజ్‌తో లభించనుంది.

ఈ హ్యాండ్‌సెట్‌లో 13MP వెనుక కెమెరా, సెల్ఫీలు, వీడియో కాలింగ్ ల కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. రెడ్‌మీ 15R 5G 6,000mAh బ్యాటరీతో పాటు 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 171.56×79.47×7.99mm కొలతలు ఉండగా.. 205గ్రాముల బరువు కలిగి ఉంది. రెడ్‌మీ 15R 5Gలో కనెక్టివిటీ ఎంపికలలో 5G, Wi-Fi 802.11 a/b/g/n/a, బ్లూటూత్ 5.4, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.

Lay off: గూగుల్ 200 మంది AI కాంట్రాక్టర్ల తొలగింపు

ఇక ధరల విషయానికి వస్తే.. రెడ్‌మీ 15R 5G 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,099 (రూ. 13,000)కాగా.. 6GB + 128GB CNY 1,599 (రూ. 19,000), 8GB + 128GB CNY 1,699 (రూ. 23,000), 8GB + 256GB CNY 1,899 (రూ. 25,000), 12GB + 256GB RAM CNY 2,299 (రూ. 28,000) ధరలతో లభ్యమవుతాయి. ఈ కొత్త ఫోన్ ప్రస్తుతం చైనాలో క్లౌడీ వైట్, లైమ్ గ్రీన్, షాడో బ్లాక్, ట్విలైట్ పర్పుల్ రంగులలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.