Oppo K13s: ఒప్పో (OPPO) తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఒప్పో K13s ను చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్ 7,000mAh బ్యాటరీ, డ్యూయల్-రియర్ కెమెరా సెటప్‌తో లాంచ్ అయ్యింది. రెండు కలర్ ఆప్షన్లలో, వివిధ RAM వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 SoC ప్రాసెసర్‌తో వచ్చింది. ఇందులో గరిష్టంగా 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఉన్నాయి.
ఇక Oppo K13s మొబైల్ కెమెరాల విషయానికొస్తే.. ఒప్పో K13s వెనుక వైపు డ్యూయల్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. ఇందులో 50MP (f/1.8) ప్రైమరీ రియర్ కెమెరా, 27mm ఫోకల్ లెంగ్త్, ఆటో-ఫోకస్ సపోర్ట్‌తో కూడిన 2MP లెన్స్ ఉన్నాయి. ముందు వైపు 32MP (f/2.4) సెల్ఫీ కెమెరా 24mm ఫోకల్ లెంగ్త్‌తో ఉంది. ఈ ఫోన్ వెనుక కెమెరా 4K వీడియో రికార్డింగ్‌కు 30fps వద్ద సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీల కోసం ముందు వైపు 32MP కెమెరా కూడా ఉంది.
7,000mAh బ్యాటరీ, 6.72 అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లేతో అమ్మకాల సునామి సృష్టించడానికి సిద్దమైన Moto G36!
అలాగే డిస్ప్లే విషయానికొస్తే ఇందులో 6.8 అంగుళాల ఫుల్ HD+ (2,800×1,280 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz గరిష్ట టచ్ శాంప్లింగ్ రేట్, 100 శాతం DCI-P3, sRGB కలర్ గ్యామట్, 1.07 బిలియన్ రంగులు, 453ppi పిక్సెల్ డెన్సిటీలతో పాటు 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్తో పనిచేస్తుంది. ఇది 2.63GHz పీక్ క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. ఇది అడ్రెనో 7-సిరీస్ GPUతో జత చేయబడింది. Oppo K13s ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, E కంపాస్, యాక్సెలెరోమీటర్ వంటి సెన్సార్లు ఉన్నాయి.
Leica కెమెరా, 5,500mAh బ్యాటరీ, 1336 సింగిల్ కోర్ స్కోరుతో రాబోతున్న Xiaomi 15T!
ఈ కొత్త ఒప్పో హ్యాండ్సెట్ భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం ఇది Wi-Fi 6, బ్లూటూత్ 5.4 లను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 7,000mAh బ్యాటరీతో పాటు 80W SuperVOOC ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్‌ను అందిస్తుంది. చైనాలో Oppo K13s ప్రారంభ ధర CNY 1,499 (రూ. 18,500). ఇది 8GB RAM + 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్‌తో అందుబాటులో ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ CNY 1,599 (రూ. 20,000) ధరతో లభిస్తుంది. ఈ మొబైల్ ఎనర్జీ బ్లూ, సూపర్ వైట్ కలర్లలో అందిస్తుంది. ఒప్పో K13s ప్రస్తుతం చైనాలోని అధికారిక కంపెనీ వెబ్సైట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.