Leading News Portal in Telugu

Thomson Launches First QLED TVs with JioTel OS and HDR10+ in India


Thomson: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ సందర్భంగా థామ్సన్ సంస్థ భారతదేశంలో కొత్త 50, 55 అంగుళాల జియోటెల్ OS QLED స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. భారతదేశంలో జియోటెల్ OSతో టీవీలను ప్రారంభించిన మొట్టమొదటి బ్రాండ్ థామ్సన్. వీటికి వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించింది. జియో రూపొందించిన భారతదేశపు స్వంత స్మార్ట్ టీవీ ప్లాట్‌ఫారమ్ అయిన జియోటెల్ OSతో ఈ కొత్త టీవీలు వస్తున్నాయి. ఇవి భారతీయ గృహాలకు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.

కాలేయాన్ని పరిశుభ్రంగా,ఆరోగ్యంగా ఉంచే రహస్య ఆహారాలు: ఇవి తప్పక తినండి!

ఈ టీవీలు బెజిల్-లెస్ డిజైన్, ప్రీమియం అలాయ్ స్టాండ్‌లతో వస్తాయి. ఇవి 1.1 బిలియన్ రంగులతో, HDR10+తో కూడిన QLED 4K డిస్‌ప్లేను (3840 × 2160 పిక్సెల్స్) కలిగి ఉంటాయి. దీని బ్రైట్‌నెస్ 450 నిట్స్ వరకు ఉంటుంది. ప్రత్యక్ష మ్యాచ్‌లను మెరుగ్గా చూసేందుకు ఇందులో స్పోర్ట్స్ మోడ్ కూడా ఉంది. ఇంకా కనెక్టివిటీ కోసం డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, వాయిస్ ఎనేబుల్డ్ రిమోట్, హెచ్‌డిఎమ్‌ఐ, యూఎస్‌బి పోర్టులు, స్క్రీన్ మిర్రరింగ్ సపోర్ట్ ఉన్నాయి. 48W స్పీకర్లు డాల్బీ డిజిటల్ ప్లస్‌తో ఆడియో అవుట్‌పుట్‌ను అందిస్తాయి. వీటిలో ఉన్న హలోజియో అసిస్టెంట్ 10 కంటే ఎక్కువ భారతీయ భాషల్లో వాయిస్ కమాండ్‌లకు సపోర్ట్ చేస్తుంది. అలాగే 10+ OTT యాప్‌ల నుంచి మీకు నచ్చిన వాటిని సిఫార్సు చేస్తుంది. వీటికి 1 సంవత్సరం వ్యారేంటి లభించనుంది.

AI ఫీచర్లు, లైవ్ ట్రాన్స్‌లేషన్‌, 3K వీడియో రికార్డింగ్, భారీ బ్యాటరీ లైఫ్‌తో Ray-Ban Meta Gen 2 లాంచ్!

ఈ థామ్సన్ టీవీలలో ఆమ్లాజిక్ చిప్‌సెట్ ఉంది. దీనికి 2GB ర్యామ్, 8GB స్టోరేజ్ కలిగి ఉంది. ఇక వీటి ధరల విషయానికి వస్తే.. 50 అంగుళాల (50TJQ002) టీవీ రూ. 19,999కు, 55 అంగుళాల (55TJQ0032) టీవీ రూ. 25,999కు లభించనుంది. ఇక లాంచ్ ఆఫర్స్ కింద 3 నెలల జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అలాగే 1 నెల జియోగేమ్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఉంటుంది. యాక్సిస్, ఐసిఐసిఐ కార్డ్ యూజర్లకు కనీసం 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ టీవీలు సెప్టెంబర్ 23 నుండి అందుబాటులో ఉంటాయి.