- గేమింగ్ లవర్స్‌కి గుడ్ న్యూస్..
- iQOO 15 RGB లైట్స్, కలర్ చేంజింగ్ ప్యానెల్‌తో గ్రాండ్ ఎంట్రీకి రెడీ
- 50MP పెరిస్కోప్ కెమెరా, ఆండ్రాయిడ్ 15 సపోర్ట్‌తో మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు.
iQOO 15: iQOO 15 వచ్చే నెలలో చైనాలో అధికారికంగా లాంచ్ కానుంది. ఈ లాంచ్‌కి ముందే స్మార్ట్‌ఫోన్‌కు ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా కంపెనీ తన అధికారిక టీజర్ ద్వారా ఫోన్ డిజైన్‌ను కూడా విడుదల చేసింది. ఇక ఈ iQOO 15 డిజైన్ లో వెనుక భాగన పెద్ద సర్క్యులర్ కెమెరా ఐలాండ్ కనిపిస్తోంది. ఇందులో సెన్సార్లు అమర్చబడ్డాయి. ప్రత్యేకంగా ఈ కెమెరా రింగ్ RGB లైట్స్‌తో ప్రకాశించేలా డిజైన్ చేశారు. ఇది ఫోన్‌కు అదనపు స్టైల్‌ను ఇస్తుంది. ఫోన్ బ్యాక్ప్యానెల్ స్పేస్షిప్లా కనిపించేలా డిజైన్ చేశారు. ఫోన్ కుడి వైపు ఫ్రేమ్‌లో మెటల్ మిడిల్ ఫ్రేమ్, చక్కటి ఫినిషింగ్‌తో ఉన్న బటన్ కనిపిస్తోంది.
Kokapet Murder: కూరగాయాల కత్తితో రప్పా రప్పా పొడిచి.. భర్తను చంపిన భార్య!
టిప్‌స్టర్ సమాచారం ప్రకారం, iQOO 15లో అప్‌గ్రేడ్ అయిన 50MP 3X పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. దీనివల్ల కెమెరా ఐలాండ్ కొంచెం మందంగా కనిపిస్తుంది. అలాగే, బ్యాక్ ప్యానెల్లో హిడెన్ RGB లైట్ కూడా ఉంటుంది. మరో లీక్ ప్రకారం, iQOO 15లో కలర్ చేంజింగ్ ప్యానెల్ ఉండనుంది. ఇది యాంగిల్ ఆధారంగా గ్రే నుండి పింక్‌కి షేడ్ మారుతుంది. V2505A మోడల్ నెంబర్‌తో ఒక హ్యాండ్సెట్ బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్లో కనిపించింది. ఇది iQOO 15గానే భావిస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ 15పై 12GB ర్యామ్ తో రన్ అవుతోంది.
Minor Girl Gang R*pe: దారుణం.. సోషల్ మీడియా పరిచయం.. మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్!
ఇక గీక్‌బెంచ్ సింగిల్, మల్టీ-కోర్ పరీక్షలలో ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్ వరుసగా 2,360, 7,285 పాయింట్లను నమోదు చేసింది. అయితే, ఇవి iQOO 13 కంటే తక్కువ. మొత్తంగా చూస్తే, iQOO 15 కొత్త డిజైన్, కలర్ చేంజింగ్ ప్యానెల్, RGB లైటింగ్, పెరిస్కోప్ కెమెరాతో ఆకట్టుకోనుంది.