Leading News Portal in Telugu

iPhone 17 Delivery in 30 Minutes via Blinkit.. Apple Fastest Service


  • ఇక ఆపిల్ స్టోర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు!
  • కేవలం 30 నిమిషాల్లో iPhone 17 మీ చేతిలోకి Blinkit ద్వారా
  • అదే ధర.. అదనపు ఛార్జీలు లేవు!

IPhone 17 Blinkit: ఆపిల్ తన కొత్త ఐఫోన్స్ 17 సీరీస్ ను విడుదల చేసిన రెండు వారాల తర్వాత నేటి నుంచి దేశవ్యాప్తంగా వాటి అమ్మకాలను మొదలుపెట్టింది. దీనితో దేశ రాజధాని ఢిల్లీ, దేశ వాణిజ్య రంగ రాజధానిగా పిలిచే ముంబై నగలలో ఉన్న ఆపిల్ స్టోర్స్ వద్ద ప్రజలు మొబైల్స్ కొనేందుకు బారులు తీరారు. అయితే, ఇప్పుడు ప్రజలు ఆపిల్ స్టోర్ కు వెళ్లే అవసరం లేకుండా బ్లింకిట్ ద్వారా నేరుగా ఆపిల్ ఐఫోన్ 17 లను డెలివరీ చేస్తుంది. ఏంటి, కొత్త ఆపిల్ ఐఫోన్ 17ను డెలివరీ చేస్తుందని ఆశ్చర్యపోతున్నారా.? అవునండి బాబు.. అది కూడా కేవలం ఆర్డర్ చేసిన అరగంటలోపు మీ ఫోన్ మీ చేతిలో ఉంటుందంటే నమ్మండి.

గేమింగ్ లవర్స్ గెట్ రెడీ.. RGB లైట్స్‌తో మెరిసే ఫీచర్స్తో వచ్చేస్తున్న iQOO 15!

అది కూడా ఆపిల్ వెబ్ సైట్, స్టోర్స్ లో ఎంత అయితే ధర ఉందో.. అదే ధరకు ఈ కామర్స్ బ్లింకిట్ లో కూడా జాబితా చేయబడింది. అంటే, ప్రజలు ఎలాంటి అదనపు డబ్బు చెల్లించకుండా ఆపిల్ ఫోన్లను ఇంటి దగ్గర నుండే ఆర్డర్ చేసుకోవచ్చు. అది కూడా కేవలం 30 నిమిషాల్లో డెలివరీ అయ్యేలా. అయితే, ఈ ఐఫోన్ డెలివరీలకు కేవలం ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే డెలివరీలు చేయబడుతున్నాయి. ముందుముందు ఈ ఫోన్స్ ప్రముఖ నగరాల్లోని షోరూంస్ లోకి అందుబాటులోకి రానున్నాయి.

iPhone 17: ఈ క్రేజ్ ఏంట్రా బాబు.. ఐఫోన్‌ 17 కోసం స్టోర్ల ముందు అర్ధరాత్రి నుంచే పడిగాపులు!

తెల్లవారుజాము నుంచి క్యూలో నిలబడి ఉన్న వారి మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ డెలివరీ సదుపాయం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంచి. ఇందులో కేవలం ఐఫోన్ 17 మాత్రమే కాకుండా ఐఫోన్ 16 మోడల్స్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అది కూడా కేవలం అరగంటలోపే మీ చెంత చేరుతాయి.