Leading News Portal in Telugu

Realme 15x 5G Launched in India with 7,000mAh Battery, 50MP Sony AI Camera, IP69 Rating.. Price Starts at Rs 16,999


  • 7,000mAh భారీ బ్యాటరీతో Realme15x5G లాంచ్.
  • 50MP సోనీ కెమెరా, IP69 రేటింగ్
  • ధర రూ.16,999 నుంచి మొదలు.

Realme 15x 5G: రియల్‌మీ (Realme) తన కొత్త స్మార్ట్‌ఫోన్ Realme 15x 5G ను భారత మార్కెట్‌లో బుధవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ లోప్రధాన ఆకర్షణగా 7,000mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లను కలిగి ఉంది. వీటితోపాటు మరిన్ని ఫీచర్లతో బడ్జెట్‌ సెగ్మెంట్‌లో వినియోగదారులకు మంచి ఆప్షన్‌గా నిలిచే అవకాశం ఉంది.

డిస్‌ప్లే & డిజైన్:
రియల్‌మీ 15x 5Gలో 6.8 అంగుళాల సన్ లైట్ డిస్ప్లే ఉంటుంది. ఇది HD+ (720×1570 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. అంతేకాకుండా ఐ ప్రొటెక్షన్ మోడ్, స్లీప్ మోడ్, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ స్విచింగ్, కలర్ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ బరువు 212 గ్రాములు కాగా, మందం 8.28mm మాత్రమే ఉంది.

TGSRTC: దసరాకి 8 వేల ప్రత్యేక బస్సులు.. తాత్కాలిక బస్‌స్టాండ్‌లు ఏర్పాటు!

చిప్‌సెట్:
ఈ స్మార్ట్‌ఫోన్‌ను మీడియాటెక్ డిమెంసిటీ 6300 (6nm) చిప్‌సెట్ తో పని చేస్తుంది. ఇది గరిష్టంగా 2.4GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది. గ్రాఫిక్స్ కోసం ARM Mali-G57 MC2 GPU అందించబడింది. ఈ ఫోన్‌లో గరిష్టంగా 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ లభిస్తుంది. అంతేకాకుండా 2TB వరకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉంది.

కెమెరా ఫీచర్లు:
రియల్‌మీ 15x 5G వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ప్రధానంగా 50MP సోనీ IMX852 AI కెమెరా (f/1.8) తో వస్తుంది. ముందు భాగంలో కూడా 50MP OmniVision OV50D40 సెల్ఫీ కెమెరా అమర్చబడింది. వీడియో ఫీచర్లలో 1080p రికార్డింగ్, డ్యూయల్ వ్యూ వీడియో, స్లో మోషన్, టైమ్ లాప్స్, అండర్‌ వాటర్ మోడ్, సినిమాటిక్ షూటింగ్ వంటి ఆప్షన్లు ఉన్నాయి.

బ్యాటరీ & కనెక్టివిటీ:
ఈ ఫోన్‌లో 7,000mAh బ్యాటరీతో పాటు 60W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G, Wi-Fi 5, బ్లూటూత్ 5.3, GPS, GLONASS, Galileo, BeiDou, QZSS ఉన్నాయి. వీటితోపాటు ఇందులో సెన్సార్లలో ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియెంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, E-కాంపాస్, యాక్సెలెరోమీటర్, గైరోస్కోప్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి.

TGSRTC: దసరాకి 8 వేల ప్రత్యేక బస్సులు.. తాత్కాలిక బస్‌స్టాండ్‌లు ఏర్పాటు!

ధర:
రియల్‌మీ 15x 5G ధర భారతదేశంలో రూ. 16,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 6GB + 128GB వేరియంట్ ధర రూ.16,999, 8GB + 128GB వేరియంట్ ధర రూ.17,999, అలాగే 8GB + 256GB వేరియంట్ ధర రూ.19,999గా నిర్ణయించారు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయానికి అందుబాటులో ఉంది. ప్రత్యేక ఆఫర్లలో రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (UPI, క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో) లేదా రూ.3,000 ఎక్స్చేంజ్ బోనస్‌తో పాటు 6 నెలల వడ్డీ లేని EMI సౌకర్యం వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఆకర్షణీయమైన ఆక్వా బ్లూ, మెరైన్ బ్లూ, మెరూన్ రెడ్ కలర్ మూడు రంగుల్లో లభిస్తోంది.