Leading News Portal in Telugu

Samsung Galaxy M07 Launched in India with 6 Years of Security Updates, 50MP Camera, and IP54 Rating


Samsung Galaxy M07: దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) తాజాగా బడ్జెట్ 4G ఫోన్ Galaxy M07ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ 6.7 అంగుళాల HD+ LCD స్క్రీన్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో MediaTek Helio G99 ప్రాసెసర్ అమర్చారు. 4GB RAM తో పాటు 64GB అంతర్గత స్టోరేజ్ ఇందులో అందించారు. అంతేకాకుండా మైక్రో SD స్లాట్ ద్వారా మెమరీని 2TB వరకు పెంచుకోవచ్చు. ఫోటోగ్రఫీ విభాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఇంకా ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా అందించారు.

Floods: నేపాల్ లో భారీ వరదలు.. 22 మందికి పైగా మృతి..

శాంసంగ్ గెలాక్సీ M07 ముఖ్యమైన విశేషం దాని సాఫ్ట్‌వేర్ సపోర్ట్. ఈ ఫోన్‌కు 6 OS అప్‌డేట్‌లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు లభించనున్నాయి. ఇది ఇప్పటివరకు బడ్జెట్ కేటగిరీలో శాంసంగ్ అందించిన మొదటి ఫోన్ కావడం విశేషం. ఇక బ్యాటరీ పరంగా చూస్తే, ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తుంది. అయితే, ఛార్జర్ బాక్స్‌లో ఇవ్వలేదు. ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5mm ఆడియో జాక్, USB Type-C పోర్ట్, మరియు IP54 రేటింగ్ (డస్ట్, స్ప్లాష్ రెసిస్టెంట్) ఉన్నాయి.

Vijay Devarakonda : ప్రేమ, పెళ్లి.. షాకింగ్ స్టెట్‌మెంట్ పాస్ చేసిన విజయ్ దేవరకొండ !

Galaxy M07 ఆండ్రాయిడ్ 15 ఆధారంగా One UI 7 మీద నడుస్తుంది. ఇది డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac (2.4GHz + 5GHz), Bluetooth 5.3, GPS + GLONASS వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. ఈ కొత్త సామ్‌సంగ్ గెలాక్సీ M07 ప్రస్తుతం బ్లాక్ కలర్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను రూ.7,699గా నిర్ణయించారు. అయితే, అమెజాన్ వంటి ఆన్‌లైన్ రిటైలర్ల వద్ద కేవలం రూ.6,999 కే పొందవచ్చు.