- వాట్సాప్‌లో బిజినెస్ ప్రమోషనల్ మెసేజెస్
- ఇలా చెక్ పెట్టండి
ఇన్ స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్ కు కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. కాల్స్, మెసేజెస్, ఆడియో, వీడియో రికార్డింగ్ వంటి అనేక ఫీచర్ల ను కలిగి ఉంది. అయితే ఇటీవల బ్యాంకింగ్ సెక్టార్, వ్యాపార సంస్థలు వాట్సాప్ ను యూజ్ చేస్తున్నాయి. ప్రమోషనల్ మెసేజెస్ ను యూజర్లకు పంపిస్తున్నాయి. ఈ సందేశాలు ఆఫర్లు, సేవలు, డిస్కౌంట్ల గురించి ఉండవచ్చు. ఈ పదే పదే వచ్చే WhatsApp సందేశాల వల్ల చాలా మంది చిరాకు పడుతుంటారు. ఆఫీస్ వర్క్ లో ఉన్నప్పుడు, బిజీ టైమ్ లో అంతరాయం కలిగిస్తుంటాయి. ఇలాంటి సమయంలో వాట్సాప్‌లోని ప్రమోషనల్ సందేశాలతో మీరు ఇబ్బంది పడుతుంటే, మీరు వాటిని సులభంగా వదిలించుకోవచ్చు.
మీరు XYZ అనే కంపెనీ నుండి పదే పదే WhatsApp సందేశాలను అందుకుంటున్నారని అనుకుందాం. ఈ సందేశాలు ఆటోమేటెడ్, అంటే అవి ఒక వ్యక్తి పంపినవి కావు, కంప్యూటర్ ద్వారా పంపబడతాయి. మీరు ఈ ఆటోమేటెడ్ సందేశాలను సులభంగా ఆపవచ్చు. మీరు ఆ కంపెనీ నుంచి వచ్చే చాట్ రూమ్‌కి వెళ్లాలి. ఇక్కడ, మీరు “STOP” అని సందేశం పంపాలి. అలా చేయడం వల్ల మీ ప్రసార సందేశాలు ఆగిపోతాయి. అయితే, కొన్ని చాట్‌లు దీని తర్వాత కూడా క్లోజ్ కాకపోవచ్చు. అలాంటి సందర్భాలలో, మీరు వాటిని బ్లాక్ చేయవచ్చు. చాట్ బ్లాక్ చేయబడిన తర్వాత, మీరు ఇకపై ఆ ఛానెల్ నుండి ఏవిధమైన ప్రమోషనల్ మెసేజెస్ రావు. వాట్సాప్ తన ప్లాట్‌ఫామ్‌ను కాలానుగుణంగా అప్‌డేట్ చేస్తుంది. కంపెనీ ఇటీవల లైవ్, మోషన్ ఫోటోలు, కొత్త చాట్ థీమ్‌లు, AI బ్యాంక్ గ్రౌండ్ ఫీచర్లను జోడించింది.