Leading News Portal in Telugu

Oppo K13x 5G Gets Massive Price Cut.. Budget 5G Phone Now at Rs. 10,543 on Amazon


Oppo K13x 5G: మొబైల్ మార్కెట్లో పోటీ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఒప్పో (Oppo) తన కొత్త బడ్జెట్ ఫోన్ Oppo K13x 5G పై మరింత డిస్కౌంట్ ను అందించింది. తక్కువ ధరలో మంచి పనితీరు, భారీ బ్యాటరీ లైఫ్, 5G కనెక్టివిటీతో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. సాధారణ రోజువారీ వాడకానికి సౌకర్యంగా ఉండే విధంగా రూపొందించబడిన ఈ స్మార్ట్‌ఫోన్, మధ్యస్థాయి సెగ్మెంట్‌లోని పాపులర్ మోడల్స్‌కి సవాల్ విసురుతోంది.

Oppo K13x 5G ఫోన్‌లో Mediatek Dimensity 6300 చిప్‌సెట్ ఉపయోగించారు. ఇది 2.4GHz క్లాక్ స్పీడ్ కలిగిన ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. మల్టీటాస్కింగ్, సోషల్ మీడియా యాప్‌లు, లైట్ గేమింగ్ వంటి వాటిని సాఫీగా నిర్వహిస్తుంది. ఇందులో 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ అందించబడింది. అదనంగా మెమరీ కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ సాంప్లింగ్ రేట్‌ను అందిస్తుంది. DC డిమ్మింగ్, ఐ కంఫర్ట్ మోడ్, సన్ లైట్ స్క్రీన్ వంటి ఫీచర్లు దీర్ఘకాలిక వినియోగానికి అనుకూలంగా ఉంటాయి.

Viral News: ఇదో గమ్మత్తు తతంగం.. కట్నం వద్దన్న కాబోయే అల్లుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన మామ

ఇక బ్యాటరీ విషయానికి వస్తే, 6000mAh సామర్థ్యంతో కూడిన భారీ బ్యాటరీ ఫోన్‌లో ఇవ్వబడింది. ఇది సింగిల్ చార్జ్‌పై సులభంగా ఒక రోజు మొత్తం పనిచేస్తుంది. అలాగే, 45W SUPERVOOC ఫ్లాష్ చార్జింగ్ సపోర్ట్ ద్వారా ఫోన్ వేగంగా చార్జ్ అవుతుంది. ఇక ఈ Oppo K13x 5G లో 50MP ప్రైమరీ సెన్సార్, 2MP డెప్త్ లెన్స్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రధాన కెమెరా మంచి డిటైల్స్‌తో ఫోటోలు అందించగా, 2MP సెన్సార్ పోర్ట్రెయిట్ ఫోటోల నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇది 1080p వీడియో రికార్డింగ్ @ 60fps ను సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరాగా 8MP సెల్ఫీ కెమెరా అందించబడింది.

గత నెలలో Oppo K13x 5G ధర 8% మేర తగ్గింది. ప్రస్తుతం ఈ ఫోన్ అమెజాన్‌లో కేవలం రూ.10,543కే లభిస్తుంది. ఇది లాంచ్ ధరతో పోలిస్తే దాదాపు మూడు వేల మేర ధర తగ్గింది. కాబట్టి ఈ మొబైల్ ప్రస్తుతం కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం అని చెప్పవచ్చు. మొత్తం మీద Oppo K13x 5G బడ్జెట్ సెగ్మెంట్‌లో ఉన్నవారికి సరైన ఎంపిక. భారీ బ్యాటరీ, స్నాపీ ప్రాసెసర్, 5G కనెక్టివిటీతో పాటు, సన్నని డిజైన్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లతో ఇది ఆకర్షణీయమైన ప్యాకేజీగా మారింది. రూ.12,000 లోపు విశ్వసనీయమైన, శక్తివంతమైన ఫోన్ కావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు.

BIS Care App: ఈ మొబైల్ యాప్ తో ఇంట్లో కూర్చొని.. నకిలీ బంగారు ఆభరణాలను గుర్తించొచ్చు..