Leading News Portal in Telugu

Big alert from center for Google Chrome users


  • గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం బిగ్ అలర్ట్
  • వెంటనే ఈ పని చేయండి!

సెర్చ్ ఇంజన్ గూగుల్ క్రోమ్ గురించి కేంద్రం యూజర్లకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In), క్రోమ్ వినియోగదారులకు భద్రతా హెచ్చరిక జారీ చేసింది. ఇది విండోస్, లైనక్స్ సిస్టమ్‌లతో సహా భారతదేశంలోని మిలియన్ల మంది క్రోమ్ వినియోగదారులను ప్రభావితం చేస్తుందని తెలిపింది. CERT-In తన నివేదికలో Google వెబ్ బ్రౌజర్‌లో అనేక లోపాలు కనుగొన్నట్లు పేర్కొంది. హ్యాకర్లు ఈ బగ్‌లను ఉపయోగించుకుని వినియోగదారుల హ్యాండ్ సెట్లను యాక్సెస్ చేయవచ్చని తెలిపింది.

Chromeలో అనేక సాంకేతిక లోపాలు వెలుగుచూశాయని భద్రతా నివేదిక పేర్కొంది. వీటిలో వీడియో, వెబ్ GPUలో మెమరీ ఓవర్‌ఫ్లో, స్టోరేజ్, ట్యాబ్‌లలో డేటా లీక్, కొన్ని తప్పు కోడింగ్, అలాగే V8లోని మీడియా ఫైల్‌లను తప్పుగా చదవడం, లోపాలు, మరికొన్ని బగ్‌లు ఉన్నాయని తెలిపింది. ఈ బగ్‌లు హ్యాకర్లు వినియోగదారుల కంప్యూటర్‌లను సులభంగా యాక్సెస్ చేయడానికి సాయపడతాయని తెలిపింది.

డెస్క్‌టాప్‌లు లేదా ల్యాప్‌టాప్‌లలో Chrome ఉపయోగించే అందరు యూజర్లు ఈ బగ్ బారిన పడే ప్రమాదం ఉంది. Windows లేదా Linux సిస్టమ్‌లలో Chromeను ఉపయోగించే వినియోగదారులు ఈ బగ్ ద్వారా సులభంగా హ్యాకర్ల బాధితులుగా మారే అవకాశం ఉందని తెలిపింది. Linuxలో Chrome వెర్షన్‌లు 141.0.7390.54 లేదా అంతకు ముందు వెర్షన్‌లను ఉపయోగించే వినియోగదారులు ఈ బగ్‌ల బారిన పడే ప్రమాదంలో ఉన్నారు. Windows, Macలో 141.0.7390.54/55 కంటే ముందు వెర్షన్‌లను ఉపయోగించే వినియోగదారులు ఈ బగ్‌ల బారిన పడే ప్రమాదంలో ఉన్నారని వెల్లడించింది.

ఈ బగ్‌లను నివారించడానికి Chrome వినియోగదారులు వెంటనే వారి సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. వారి Chrome సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడానికి, వినియోగదారులు ఎగువన రైట్ కార్నర్ లో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. సెట్టింగ్‌ల మెనుకి వెళ్లి, ‘అబౌట్’ ఎంచుకుని, ఆపై ‘Chromeని నవీకరించు’పై క్లిక్ చేయాలి. Chrome వెర్షన్‌ను అప్ డేట్ చేసుకున్నట్లైతే హ్యాకర్ల భారిన పడే అవకాశం ఉండదని ప్రభుత్వ సంస్థ వెల్లడించింది.