Moto G06 Power Launched in India at Rs.7,499 with features of 50MP Camera, 7000mAh Battery and Android 15
- 7000mAh భారీ బ్యాటరీ, 3 రోజుల బ్యాకప్, 18W ఫాస్ట్ ఛార్జింగ్.
- 6.88 అంగుళాల HD+ LCD స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, గోరిల్లా గ్లాస్ 3 రక్షణ.
- 50MP రియర్ కెమెరా (f/1.8), 8MP ఫ్రంట్ కెమెరా.
- సైడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, IP64 రేటింగ్.
- అక్టోబర్ 11 నుంచి Flipkart, మోటరోలా స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి.
Moto G06 Power: మోటరోలా (motorola) తన కొత్త Moto G06 Power స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్లో వినియోగదారులకు భారీ ఫీచర్లను అందించనుంది. భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, ఆండ్రాయిడ్ 15 అనుభవంతో ఇది ఒక ఆల్‌రౌండర్ బడ్జెట్ ఫోన్‌గా నిలవనుంది. Moto G06 Power ప్రధాన ఆకర్షణ ఇందులోని 7000mAh బ్యాటరీ. కంపెనీ ప్రకారం ఇది మూడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. అలాగే ఫోన్ 1000 ఛార్జ్ సైకిల్స్ తర్వాత కూడా 80% పైగా బ్యాటరీ హెల్త్ కాపాడగలదని మోటరోలా పేర్కొంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, 18W ఫాస్ట్ ఛార్జర్ బాక్స్‌లోనే అందించబడుతుంది. అయితే 18W వల్ల బ్యాటరీ నిదానంగా ఛార్జ్ అవుతుంది.
మిడ్‌రేంజ్‌లో 50MP AI ట్రిపుల్ కెమెరా సెటప్, సరికొత్త డిజైన్‌తో లాంచ్‌కు సిద్దమైన Lava Shark 2..!
ఈ Moto G06 Power స్మార్ట్‌ఫోన్‌లో 6.88 అంగుళాల HD+ LCD డిస్ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో స్క్రీన్ మరింత బలంగా ఉంటుంది. ఈ మొబైల్ లో MediaTek Helio G81-Ultra చిప్సెట్ ను ఉంచారు. అలాగే ఈ ఫోన్లో 4GB LPDDR4X ర్యామ్, 64GB స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. అలాగే 8GB వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంది. స్టోరేజ్‌ను 1TB వరకు మైక్రోSD కార్డ్ ద్వారా పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. మోటరోలా 2 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లను (SMR) అందించనుంది.
ఇక ఫోటోగ్రఫీ కోసం 50MP రియర్ కెమెరా (f/1.8, LED ఫ్లాష్‌తో), 8MP ఫ్రంట్ కెమెరా (f/2.0) ఉన్నాయి. ఈ కెమెరా సెటప్ ద్వారా ఫోటోలు, వీడియోలు నేచురల్‌గా వస్తాయి. Moto G06 Powerలో స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్ సౌండ్ టెక్నాలజీ ఉన్నాయి. ఇవి మ్యూజిక్, వీడియోలలో రిచ్ ఆడియో అనుభవంను అందిస్తాయి. వీటితోపాటు, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5mm ఆడియో జాక్, USB టైపు-C పోర్ట్ కూడా ఉన్నాయి. ఫోన్‌కు IP64 రేటింగ్ ఉండటంతో ఇది దుమ్ము, నీటి చినుకుల నుండి రక్షణ పొందుతుంది.
2025 Nobel Prize Physics: భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్ బహుమతి..
ఇక కనెక్టివిటీ పరంగా చూస్తే.. ఈ ఫోన్ డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac (2.4GHz + 5GHz), బ్లూటూత్ 6.0, GPS, USB టైపు-C పోర్ట్ సదుపాయాలను కలిగి ఉంది. ఫోన్ పరిమాణం 171.35 x 77.50 x 8.82mm కాగా, బరువు 220 గ్రాములుగా ఉంది. ఇక మొబైల్ ధర విషయానికి వస్తే, Moto G06 Power 4GB RAM + 64GB స్టోరేజ్ ఒక్క వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర కేవలం రూ.7,499 మాత్రమే. ఇది టెండ్రిల్, తాపేస్ట్రీ, లారెల్ ఓక్ రంగుల్లో లభించనుంది. ఈ ఫోన్ విక్రయాలు అక్టోబర్ 11వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్, మోటోరోలా, ఇంకా ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్లలో ప్రారంభం కానున్నాయి.