Huawei MatePad 12 X (2025) launched with 2.8K PaperMatte display, Kirin T92B chip, and 10,100mAh battery
Huawei MatePad 12 X: ప్రముఖ టెక్ దిగ్గజం హువావే (Huawei) తన తాజా టాబ్లెట్ MatePad 12 X (2025)ను గురువారం జర్మనీలో అధికారికంగా లాంచ్ చేసింది. ఇది గత ఏడాది విడుదలైన MatePad 12 X (2024)కి సక్సెసర్‌గా రాగా, డిస్‌ప్లే, పనితీరు, బ్యాటరీ, కనెక్టివిటీ విభాగాల్లో పలు అప్‌గ్రేడ్లను కలిగి ఉంది. Huawei MatePad 12 X (2025) ధర EUR 649 (రూ.66,000)గా నిర్ణయించబడింది. ఇది 12GB RAM + 256GB స్టోరేజ్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ టాబ్లెట్‌ను గ్రీన్, వైట్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో విడుదల చేశారు.
Hyderabad: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఏకంగా రూ.72 కోట్లు..!
ఈ కొత్త MatePad 12 X (2025)లో 12 అంగుళాల 2.8K (1840×2800 పిక్సెల్స్) LCD PaperMatte డిస్‌ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. ట్రిపుల్ TÜV Rheinland సర్టిఫికేషన్ పొందిన ఈ స్క్రీన్, సూర్యకాంతి లేదా లైటింగ్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇక ఈ టాబ్లెట్‌లో Kirin T92B ఆక్సా-కోర్ ప్రాసెసర్ ను ఉపయోగించారు. ఇది HarmonyOS 4.3పై నడుస్తుంది. 12GB RAM అండ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తున్న ఈ మోడల్, వేగవంతమైన మల్టీటాస్కింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఇది PCBA-లెవెల్ 3D డిస్పెన్సింగ్, 3D వేపర్ కూలింగ్ చాంబర్ సాంకేతికతలతో వేడిని సమర్థవంతంగా నియంత్రిస్తుంది.
MatePad 12 X (2025)లో వెనుక భాగంలో 50MP కెమెరా (f/1.8 అపర్చర్)తో పాటు ఆటోఫోకస్ సదుపాయం ఉంది. ముందు భాగంలో 8MP ఫ్రంట్ కెమెరా (f/2.2)ను సెట్ చేశారు. రెండూ 1080p వీడియో రికార్డింగ్ కి సపోర్ట్ చేస్తాయి. హువావే ఈ టాబ్లెట్‌ను ఆరు స్టీరియో స్పీకర్లుతో అందించింది, దీంతో మ్యూజిక్, వీడియో అనుభవం మరింత రిచ్‌గా ఉంటుంది. అలాగే, ఇది వన్-టచ్ స్ప్లిట్ స్క్రీన్ ఫీచర్ ను సపోర్ట్ చేస్తుంది. క్రియేటివ్ యూజర్లకు Huawei M-Pencil Proతో పూర్తిగా అనుకూలంగా ఉంటుంది.
IND vs WI Test: ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి టీమిండియా..
ఇక కనెక్టివిటీ & బ్యాటరీ విషయానికి వస్తే.. MatePad 12 X (2025)లో Wi-Fi 7, Bluetooth 5.2, NFC, OTG, మరియు USB Type-C సపోర్ట్ ఉన్నాయి. ఇది 10,100mAh బ్యాటరీతో వస్తుంది, ఇది 66W ఫాస్ట్ ఛార్జింగ్ను సపోర్ట్ చేస్తుంది. మోతమ్గా, Huawei MatePad 12 X (2025) ఒక శక్తివంతమైన ప్రీమియం టాబ్లెట్‌గా నిలుస్తుంది. PaperMatte డిస్‌ప్లే, వేగవంతమైన ప్రాసెసర్, మల్టీమీడియా ఫీచర్లు, పెద్ద బ్యాటరీ వంటి అంశాలతో ఇది విద్యార్థులు, ప్రొఫెషనల్స్, క్రియేటర్స్‌కి సముచిత ఎంపికగా కనిపిస్తోంది.