Leading News Portal in Telugu

Samsung Galaxy M17 5G Launched in India with 50MP Camera, Gemini Live Features, and IP54 Rating


Samsung Galaxy M17 5G: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్‌ భారత మార్కెట్లో తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ Galaxy M17 5Gని లాంచ్ చేసింది. M16 5Gకి అప్‌గ్రేడ్‌గా వచ్చిన ఈ ఫోన్‌లో డిజైన్, పనితీరు, బ్యాటరీ పరంగా పలు మెరుగుదలను తీసుకవచ్చారు. ఈ గెలాక్సీ M17 5Gలో 6.7 అంగుళాల FHD+ Super AMOLED 90Hz డిస్‌ప్లే ఉంది. స్క్రీన్‌కు Corning Gorilla Glass Victus ప్రొటెక్షన్ ఇచ్చారు. ఈ ఫోన్ Exynos 1330 చిప్‌సెట్ తో నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా One UI 7.0పై నడుస్తూ, జెమినీ లైవ్ ఫీచర్స్ తో వస్తోంది. కంపెనీ ప్రకారం, ఈ ఫోన్‌కు 6 సంవత్సరాల OS, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించబడతాయి.

Rajamouli : బాహుబ‌లి మాయాజాలం వెనుక రాజ‌మౌళి కృషి.. జక్కన్న స్పెషల్ బ‌ర్త్‌డే వీడియో!

ఇక కెమెరా విభాగంలో 50MP మెయిన్ కెమెరా, 5MP అల్ట్రావైడ్, 2MP మాక్రో లెన్స్, అలాగే 13MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, USB టైప్-C ఆడియో, బాటమ్ పోర్టెడ్ స్పీకర్లు ఉన్నాయి. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో పాటు 25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ను కలిగి ఉంది. ఈ పరిమాణం 164.4 x 77.9 x 7.5mm కాగా, బరువు 192 గ్రాములు మాత్రమే ఉండటంతో ఫోన్ స్లిమ్‌గా అనిపిస్తుంది.

అనకాపల్లి పర్యటనలో స్పీకర్ అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం…

శాంసంగ్‌ గెలాక్సీ M17 5G ఫోన్ మూన్ లైట్ సిల్వర్, సాప్ఫిరే బ్లాక్ అనే రెండు ఆకర్షణీయ రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మూడు వేరియంట్లలో లభిస్తోంది. 4GB + 128GB మోడల్‌ ధర రూ.12,499, 6GB + 128GB మోడల్‌ ధర రూ.13,999, అలాగే 8GB + 128GB టాప్-ఎండ్‌ మోడల్‌ ధర రూ.15,499గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను అక్టోబర్ 13 నుంచి అమెజాన్, శాంసంగ్‌ వెబ్ సైట్స్ లతోపాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్లలో భాగంగా వినియోగదారులు రూ.500 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ పొందడమే కాకుండా, ప్రముఖ బ్యాంకుల కార్డ్స్ ద్వారా 3 నెలల వరకు నో కాస్ట్ EMI సౌకర్యాన్ని కూడా పొందవచ్చు.