Leading News Portal in Telugu

How to Improve Your CIBIL Score & Get Easy Loan Approvals


  • సిబిల్ స్కోర్ ని బట్టే లోన్ లు మంజూరు చేస్తున్న బ్యాంక్ లు
  • సిబిల్ స్కోర్ సాధారణంగా 300 నుండి 900 వరకు ఉంటుంది

సాధారాణంగా బ్యాంక్ లు లోన్ కావాలన్నా క్రెడిట్ కావాలన్నా ముఖ్యంగా మీ సిబిల్ స్కోర్ ని బట్టే మీకు లోన్ మంజూరు చేస్తాయి. సిబిల్ సరిగ్గా లేకపోతే లోన్ రావడం చాలా కష్టంగా ఉంటుంది.

సిబిల్ స్కోర్ సాధారణంగా 300 నుండి 900 వరకు ఉంటుంది. 750 కంటే ఎక్కువ మీ సిబిల్ స్కోర్.. మిమ్మల్ని ఎక్సలెంట్ కస్టమర్ పరిగణించి.. తక్కువ వడ్డీకే లోన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 650 కంటే తక్కువగా ఉంటే మీరు సమయానికి ఈ ఎంఐ కట్టడంలేదని అర్థం. అపుడు మీకు లోన్ రావాలన్నా చాలా కష్టం అవుతుంది. మీ స్కోర్ ఎంత పెరిగితే అంత లాభం అన్నమాట. ఒకవేళ ఇచ్చినా అధిక వడ్డీ రేటు చెల్లించాల్సి రావచ్చు. కాబట్టి సిబిల్ స్కోర్ తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.

సిబిల్ స్కోర్ అనేది మీ ఆర్థిక గుర్తింపునకు చాలా ముఖ్యమైన కొలమానం. మీరు లోన్ లేదా క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ముందుగా తనిఖీ చేసేది ఈ స్కోర్‌నే. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్ రావడం కష్టమవుతుంది. ఒకవేళ ఇచ్చినా అధిక వడ్డీ రేటు చెల్లించాల్సి రావచ్చు. కాబట్టి సిబిల్ స్కోర్ తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఎప్పటికప్పుడు మీ సిబిల్ స్కోర్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుంది. మీరు ఆలస్యం చేస్తే అపరాధ రుసుముతో పాటు మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. కాబట్టి ప్రతి ఈఎంఐని క్రెడిట్ కార్డు బకాయిని గడువు తేదీలోగా చెల్లించాలి.

క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ యూజ్ చేస్తే.. మాత్రం కచ్చితంగా ప్రతినెల కట్టేయండి ఎందుకంటే దీని ద్వారానే మీ సిబిల్ స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది. వేరేవారి లోన్‌కి గ్యారెంటర్‌గా ఉండకండి. మీరు ఎవరికైనా హామీదారుగా మారినప్పుడు ఆ వ్యక్తి రుణం చెల్లించకపోతే, ఆ ప్రభావం నేరుగా మీ CIBIL స్కోర్‌పై పడుతుంది.మీరు రెండవ రుణం తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే, కొత్త లోన్ తీసుకునే ముందు మునుపటి రుణాన్ని పూర్తిగా క్లియర్ చేయడానికి ప్రయత్నించండి. ఇది మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను బలోపేతం చేసి స్కోర్‌ను మెరుగుపరుస్తుంది. మెరుగైన సిబిల్ స్కోర్ అంటే బ్యాంకుల దృష్టిలో మీరు నమ్మకమైన కస్టమర్ అని అర్థం. సరైన ఆర్థిక ప్రణాళికతో, క్రమశిక్షణతో ఈ చిట్కాలను పాటిస్తే, మీ క్రెడిట్ స్కోర్‌ను సులభంగా పెంచుకోవచ్చు.