Leading News Portal in Telugu

iQOO 15 Launch Date Confirmed with Snapdragon 8 Elite Gen 5, 50MP Triple Camera, 7000mAh Battery


iQOO 15: iQOO సంస్థ తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ iQOO 15ను చైనా మార్కెట్లో కొద్ది రోజుల్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ ఫోన్‌లో Snapdragon 8 Elite Gen 5 SoC చిప్‌సెట్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది Xiaomi 17 సిరీస్ తర్వాత ఈ ప్రాసెసర్‌ను పొందిన రెండవ ఫోన్‌గా నిలుస్తుంది. తాజా లీక్‌ల ప్రకారం, iQOO 15 భారతీయ మార్కెట్‌లో నవంబర్ మధ్య లేదా చివరలో విడుదల కానుందని సమాచారం. భారత మార్కెట్లో ఈ ఫోన్ Realme GT 8 Pro తర్వాత Snapdragon 8 Elite Gen 5 చిప్‌తో వచ్చే రెండవ స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తుంది. iQOO 15 చైనా లాంచ్ అక్టోబర్ 20న జరగనుంది. భారత మార్కెట్లో దీని ధర దాదాపు రూ.60,000 లోపుగా ఉండవచ్చని అంచనా.

50MP+50MP కెమెరా సెటప్, 120Hz రిఫ్రెష్ రేట్ తో లాంచ్ కు సిద్దమైన Motorola Edge 70..!

iQOO 15లో 6.85 ఇంచుల 2K ఫ్లాట్ LTPO AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది గేమింగ్, మల్టీమీడియా అనుభవానికి మరింత స్మూత్ విజువల్స్‌ను ఇస్తుంది. ఫోన్‌లో Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ తో పాటు Q3 గేమింగ్ చిప్ ను కూడా ఉపయోగించారు. ఇది గ్రాఫిక్స్, రియల్ టైమ్ పనితీరును మెరుగుపరుస్తుంది. మెమరీ, స్టోరేజ్ కోసం LPDDR5X ర్యామ్, UFS 4.1 టెక్నాలజీను వినియోగించారు.

ఈ రాబోయే ఫోన్‌లో 50MP ప్రధాన కెమెరా (1/1.56″ సెన్సార్, OIS‌తో), 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 50MP 3x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఇందులో 7000mAh భారీ బ్యాటరీ వస్తుండగా.. ఇది 100W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.

Jubilee Hills By Election: నేడే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నోటిఫికేషన్..

సెక్యూరిటీ పరంగా, ఈ ఫోన్‌లో అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ను అందించారు. ఇది IP68+IP69 రేటింగ్ తో వస్తుంది. అంటే ఇది నీరు, ధూళికి నిరోధకంగా ఉంటుంది. సాఫ్ట్‌వేర్ పరంగా iQOO 15 Android 16పై OriginOS 6తో నడుస్తుంది. అలాగే ఫోన్‌లో కస్టమైజ్ చేయగల RGB లైటింగ్ కూడా ఉంది. ఇది ఫోన్‌కు ఆకర్షణీయమైన లుక్‌ను ఇస్తుంది.