- మోటరోలా ఎడ్జ్ 70ను నవంబర్ 5న గ్లోబల్ మార్కెట్లలో విడుదల
- 6.67 ఇంచుల POLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
- Snapdragon 7 Gen 4 చిప్‌సెట్, 12GB RAM, 512GB స్టోరేజ్ వేరియంట్‌లో లభ్యం.
- 50MP + 50MP రియర్ కెమెరాలు, 50MP సెల్ఫీ కెమెరా అందుబాటులో.
Motorola Edge 70: మోటరోలా సంస్థ కొత్త స్మార్ట్‌ఫోన్ Motorola Edge 70ను నవంబర్ 5న గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. అధికారిక లాంచ్‌కు కొన్ని వారాల ముందు ఈ ఫోన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో కనిపించడంతో దాని డిజైన్, పూర్తి స్పెసిఫికేషన్లను తెలిసిపోయాయి. లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్ Snapdragon 7 Gen 4 చిప్‌సెట్, 12GB RAMతో వస్తుంది.
పోలాండ్‌కు చెందిన ఓ వెబ్‌సైట్‌లో మోటరోలా ఎడ్జ్ 70 డిజైన్, కలర్స్, పూర్తి వివరాలతో లిస్టింగ్ అయింది. ఇందులో 6.67 ఇంచుల POLED డిస్‌ప్లే, 1,220×2,712 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉన్నాయి. ఇది కొత్త Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ పై నడుస్తుంది. 12GB RAM, 512GB స్టోరేజ్ వేరియంట్‌లో లభించనుంది.
Smriti Mandhana: తొలి బ్యాటర్‌గా స్మృతి మంధాన ప్రపంచ రికార్డు.. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు!
ఇక కెమెరా విషయంలో ఎడ్జ్ 70లో రెండు 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరాలు (f/2.0 అపర్చర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో) ఉంటాయి. ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ ఫోన్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ (Nano SIM + eSIM) సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi, NFC, GPS, Bluetooth 5.4, USB Type-C పోర్ట్ లభిస్తాయి.
మోటరోలా ఎడ్జ్ 70లో 4,800mAh లిథియమ్ అయాన్ బ్యాటరీ ఉంది. ఇది 68W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 15W వైర్‌లెస్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. ఫోన్ పరిమాణం 160×75×6mm, బరువు 170 గ్రాములు మాత్రమే ఉండడం విశేషం. ఈ ఫోన్ పాన్ టోన్ బ్రోన్జ్ గ్రీన్, పాన్ టోన్ గాడ్జెట్ గ్రే, పాన్ టోన్ లిల్లీ ప్యాడ్ వంటి రంగుల్లో లాంచ్ కానున్నాయి. లీక్ అయిన సమాచారం ప్రకారం 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర EUR 709 (రూ.73,100) నుండి EUR 801.91 (రూ.82,700) వరకు ఉండొచ్చు.
Jubilee Hills By Election: నేడే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నోటిఫికేషన్..