- Vivo X300 సిరీస్ నేడు (అక్టోబర్ 13) చైనా మార్కెట్లో అధికారికంగా లాంచ్
- ఈ సిరీస్ ప్రపంచంలో తొలి MediaTek Dimensity 9500 SoCతో వచ్చే ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్
- 6.31 ఇంచుల BOE Q10+ డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్.
- 200MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా వైడ్, 50MP టెలిఫోటో లెన్స్, ట్రిపుల్ రియర్ సెటప్.
Vivo X300, Vivo X300 Pro: Vivo X300 సిరీస్ నేడు (అక్టోబర్ 13) అధికారికంగా లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లోని స్మార్ట్‌ఫోన్లు ప్రపంచంలో తొలి MediaTek Dimensity 9500 SoC చిప్‌సెట్‌తో వచ్చే ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లుగా నిలువనున్నాయి. ఈ చిప్‌సెట్‌ను సెప్టెంబర్‌లో ప్రకటించగా ఇది Snapdragon 8 Elite Gen 5కు పోటీగా వస్తోంది. Vivo X300 సిరీస్‌లో Vivo X300, Vivo X300 Pro మోడల్స్ ఉంటాయి. ఈ రెండు ఫోన్లు తమ పాత మోడల్స్ వంటి డిజైన్‌తోనే వస్తాయి. అయితే వీటిలో కొన్ని అప్గ్రేడ్ ఫోటోగ్రఫీ పనితీరు ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. ఈ మొబైల్స్ చైనా లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 13 సాయంత్రం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం 4:30 pm) జరుగనుంది. లైవ్ ప్రసారాన్ని వివో అధికారిక Weibo అకౌంట్ ద్వారా వీక్షించవచ్చు.
Bigg Boss : ఫ్లోరా సైని, శ్రీజ దమ్ము అవుట్ – రెమ్యూనరేషన్ ఫిగర్స్ వైరల్!
నేడు చైనా మార్కెట్ లో లాంచ్ కానుండగా.. భారత మార్కెట్లో మాత్రం Vivo X300 సిరీస్‌ను రాబోయే నెలల్లో విడుదల చేసే అవకాశముంది. ధరల విషయానికి వస్తే, Vivo X300 ధర సుమారు 70,000 లోపు, అలాగే Vivo X300 Pro ధర ఒక లక్ష లోపుగా ఉండవచ్చని అంచనా. ఈ ఫోన్లు బ్లూ, వైట్, పర్పుల్ రంగులలో అందుబాటులోకి రానున్నాయి. ఇకపోతే Vivo X300 ఒక కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ మోడల్. ఇది 6.31 ఇంచుల BOE Q10+ డిస్‌ప్లేతో వస్తుంది, 1.5K రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లో MediaTek Dimensity 9500 ప్రాసెసర్, 12GB RAM, 256GB UFS 4.0 స్టోరేజ్ లభిస్తుంది. కెమెరా విషయంలో వెనుక భాగంలో 200MP Samsung HPB ప్రధాన సెన్సార్, 50MP Samsung JN1 అల్ట్రా వైడ్, 50MP సోనీ LYT-602 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 50MP Samsung JN1 ఫ్రంట్ కెమెరాని అందించారు. అలాగే ఇందులో బ్యాటరీ సామర్థ్యం 6,040mAh, 90W వైర్డ్ చార్జింగ్, 40W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్ IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ తో వస్తుంది. దీని బరువు 190 గ్రాములు, మందం 7.95mm. సాఫ్ట్‌వేర్ పరంగా ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పై నడుస్తుంది.
Hanamkonda Collectorate : కలెక్టరేట్ లో కామాంధుడు.. సిబ్బందిపై అత్యాచారయత్నం..
మరోవైపు Vivo X300 Pro స్పెసిఫికేషన్లు చూసినట్లయితే.. Vivo X300 Pro ఒక శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ మోడల్. ఇది 6.78 ఇంచుల రౌండ్ మైక్రో కర్వ్‌డ్ BOE Q10+ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది కూడా 1.5K రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేటును సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా Dimensity 9500 ప్రాసెసర్ తో నడుస్తుంది. కానీ, కెమెరా విభాగంలో మరింత అప్‌గ్రేడ్ అందించింది. వెనుక భాగంలో 50MP Sony LYT-828 ప్రధాన కెమెరా, 50MP Samsung JN1 అల్ట్రా వైడ్ లెన్స్, 200MP Samsung HPB పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 50MP Samsung JN1 సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ మోడల్‌లో V1, V3+ ఇమేజింగ్ చిప్‌లు ఉండటంతో ఫోటోగ్రఫీ పనితీరు మరింత మెరుగవుతుంది. ఇందులో బ్యాటరీ సామర్థ్యం 6,510mAh, ఇది 90W వైర్డ్ చార్జింగ్, 40W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్ బరువు 226 గ్రాములు, మందం 7.99mm. ఇది కూడా IP68 రేటింగ్ కలిగి ఉంది.