Leading News Portal in Telugu

Vivo Watch GT 2 Launched with 33-Day Battery, eSIM Support and 100 Sports Modes


  • వివో తన కొత్త స్మార్ట్‌వాచ్ Vivo Watch GT 2 ను చైనాలో లాంచ్
  • 2.07 అంగుళాల రెక్టాంగ్యులర్ డిస్‌ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్, 2,400 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్
  • బ్లూఓఎస్ 3.0 పై నడుస్తుంది.
  • ఒక్కసారి చార్జ్‌తో 33 రోజుల వరకు బ్యాటరీ లైఫ్, eSIM వెర్షన్‌లో 28 రోజుల వరకు.

Vivo Watch GT 2: వివో (Vivo) తాజాగా తన స్మార్ట్‌వాచ్ Vivo Watch GT 2ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ఈ వాచ్‌ను కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ సిరీస్ Vivo X300, Vivo X300 Pro, Vivo Pad 5e, Vivo TWS 5తో పాటు లాంచ్ చేసింది. కొత్త Vivo Watch GT 2లో 2.07 అంగుళాల రెక్టాంగ్యులర్ స్క్రీన్ ఉండగా.. ఇది 60Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 2,400 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ బ్లూఓఎస్ 3.0 ఆధారంగా నడుస్తుంది. కంపెనీ ప్రకారం ఇది ఒక్కసారి చార్జ్‌తో గరిష్టంగా 33 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. అయితే eSIM వేరియంట్ మాత్రం 28 రోజుల వరకు పనిచేస్తుందని చెబుతోంది.

Crime News: బాలానగర్లో దారుణం.. ఇద్దరు పిల్లలను చంపి, ఆత్మహత్య చేసుకున్న తల్లి

ఇక స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. ఈ స్మార్ట్‌వాచ్‌లో 2.07 అంగుళాల అల్ట్రా నారో బెజెల్ స్క్రీన్, 432×514 పిక్సెల్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, 2,400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. యూజర్లు తమ ఇష్టానుసారం కస్టమ్ వాచ్ ఫేస్‌లు, ఇంటర్‌ చేంజబుల్ స్ట్రాప్‌లు మార్చుకునే అవకాశం ఉంది. ఇది బ్లూ రివర్ ఓఎస్ 3.0 పై పనిచేస్తుంది. అలాగే హెల్త్ ఫీచర్లలో భాగంగా.. ఈ వాచ్‌లో ఆప్టికల్ హార్ట్‌రేట్ సెన్సార్, SpO2 (రక్త ఆక్సిజన్) సెన్సార్, అలాగే 100కి పైగా ప్రీసెట్ స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా అక్సిలరేషన్ సెన్సార్, జైరోస్కోప్, జియోమాగ్నెటిక్ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్, హాల్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది 2ATM వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ పొందింది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.4, NFC సపోర్ట్ లభిస్తుంది.

Grandma Complaints:ఓట్ల కోసం ఇంటికి వచ్చిన నేతలు.. వెరైటీ కోరిక కోరిన వృద్ధురాలు…

ఇక బ్యాటరీ విషయానికి వస్తే, బ్లూటూత్ వెర్షన్లో 695mAh బ్యాటరీ ఉండగా.. ఇది 33 రోజుల వరకు పనిచేస్తుంది. eSIM వెర్షన్ లో 595mAh బ్యాటరీ ఉంది. దీని బ్యాటరీ లైఫ్ 28 రోజుల వరకు ఉంటుంది. పరిమాణాల పరంగా చూస్తే ఈ వాచ్ 47.54×40.19×10.97mm గా ఉండి, బ్లూటూత్ వెర్షన్ బరువు 35.8 గ్రాములుగా ఉంది. అలాగే eSIM వెర్షన్ బరువు 34.8 గ్రాములుగా ఉంది. ఇక ధర పరంగా చూస్తే Vivo Watch GT 2 బ్లూటూత్ వేరియంట్ ధర CNY 499 (రూ.6,200)గా నిర్ణయించగా, eSIM మోడల్ ధర CNY 699 (రూ.8,700)గా ఉంది. ఈ వాచ్ ఫ్రీ బ్లూ, ఆరిజిన్ బ్లాక్, ఒబిసిడియన్ బ్లాక్, షెల్ పౌడర్, వైట్ స్పేస్ వంటి రంగుల్లో లభిస్తుంది. ప్రస్తుతం ఇది చైనాలోని Vivo e-storeలో విక్రయానికి అందుబాటులో ఉంది.