Leading News Portal in Telugu

Redmi K90 Pro Geekbench Scores 11,060 Points, Snapdragon 8 Elite Gen 5, 16GB RAM, Android 16


Redmi K90 Pro: రెడ్‌మీ K80 Proకి అప్డేటెడ్ గా రెడ్‌మీ K90 Pro‌ రాబోతుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఈ ఫోన్ ప్రస్తుతం Geekbench లిస్టింగ్‌లో కనిపించింది. దీనితో కొన్ని కీలక స్పెసిఫికేషన్స్, విడుదలకు సంబందించిన వివరాలు లభించాయి. కొత్త డివైస్‌లో ఆక్టా-కోర్ SoC ఉండబోతుందని, ఇది Qualcomm సంబంధించిన తాజా ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ Snapdragon 8 Elite Gen 5 అయి ఉండొచ్చని అంచనా. Geekbench‌లో “Xiaomi 25102RKBEC” మోడల్‌గా లిస్టింగ్ అయిన ఈ ఫోన్ 16GB RAMతో వస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ మొబైల్ రన్ అవుతుంది.

Hugs And Kisses: 738 రోజుల తర్వాత కలిసిన జంటలు.. బందీల వీడియోలు వైరల్

Xiaomi కొత్త HyperOS 3ని ప్రీ-ఇన్‌స్టాల్ చేసి అందించవచ్చునని అంచనా. ప్రాసెసర్‌లో 4.61GHz రెండు కోర్స్, 3.63GHz ఆరు కోర్స్ ఉన్నాయి. Geekbench 6.5.0 లిస్టింగ్‌లో రెడ్‌మీ K90 Pro సింగిల్-కోర్‌లో 3,559 పాయింట్లు, మల్టీ-కోర్‌లో 11,060 పాయింట్లను రాబట్టింది. ఇది Xiaomi 17 వంటి స్మార్ట్ ఫ్యూన్ ప్రదర్శన ఇవ్వగలదని అర్థమవుతుంది. రెడ్‌మీ K90 Pro విడుదల తేదీ ఇంకా తెలియనిప్పటికీ, నివేదిక ప్రకారం 2025 నాల్గవ త్రైమాసికంలో అంటే నవంబర్‌ లేదా డిసెంబర్ లో రిలీజ్ కావచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఫోన్ Poco F8 Ultra పేరుతో లాంచ్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా, రెడ్‌మీ K90 Pro హై-ఎండ్ ప్రాసెసింగ్ సామర్థ్యం, పెద్ద ర్యామ్ తో వినియోగదారులకు మంచి స్మార్ట్ ఫోన్ గా మారనుంది.

Tamil Nadu: దారుణం.. 3 నెలల క్రితం ప్రేమ పెళ్లి.. అల్లుడ్ని చంపిన మామ