Leading News Portal in Telugu

BSNL Diwali Bonanza: Unlimited Plan for Just Rs.1 for New Users


  • బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా ప్రత్యేక ఆఫర్
  • రూ.1కే 30 రోజులపాటు అపరిమిత సేవలు
  • కొత్త యూజర్ల కోసం మాత్రమే ఈ ఆఫర్
  • భవిష్యత్తులో 5G సేవలు, టవర్ అప్‌గ్రేడ్

ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ యూజర్ల కోసం దీపావళి ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా (BSNL Diwali Bonanza Offer) పేరిట తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్ కేవలం రూ.1 కే అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ కొత్త యూజర్లకు మాత్రమే వర్తించనుంది. అక్టోబర్ 15వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ఆఫర్ నవంబర్ 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. కేవలం రూ.1తో 30 రోజులపాటు ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2GB డేటా, అలాగే రోజుకు 100 ఉచిత SMS లభిస్తాయి. ఆసక్తి ఉన్నవారు సమీపంలోని బీఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్లు లేదా రిటైల్ స్టోర్స్‌లో సంప్రదించవచ్చు.

Afghan-Pak War: ఆఫ్ఘాన్ ముందు పాకిస్తాన్ సరెండర్.. 48 గంటల కాల్పుల విరమణ..

కొద్ది నెలల క్రితం ప్రైవేట్ టెలికాం కంపెనీలు—రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడీయా—రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచడంతో బీఎస్ఎన్ఎల్ సౌకర్యవంతమైన, చౌక ప్లాన్లను ప్రవేశపెట్టింది. తక్కువ ధరకే ఇంటర్నెట్, వాయిస్ కాల్స్ అందించడం ద్వారా పెద్ద ఎత్తున మొబైల్ యూజర్లను ఆకర్షిస్తోంది. తరువాత 5G సేవలు కూడా ప్రారంభించనున్న బీఎస్ఎన్ఎల్, వందలాది టవర్స్ అప్‌గ్రేడ్ చేసే ప్రక్రియలో ఉంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలకు ఇది పెద్ద పోటీగా మారనుంది. అయితే, కొంత మంది యూజర్లు సిగ్నల్ సమస్యలపై ఫిర్యాదు చేస్తున్నారు.

Lion vs Leopard: అడవిలో రెండు సమ ఉజ్జీల భీకర పోరాటం.. చివరకు ఎమైందంటే..