Leading News Portal in Telugu

Apple launches new iPad Pro 2025 with M5 chip, OLED display, and next-gen AI features


iPad Pro: టెక్ దిగ్గజ కంపెనీ ఆపిల్ (Apple) తన తాజా ఫ్లాగ్‌షిప్ టాబ్లెట్ iPad Pro (2025) ను భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్‌లో అత్యాధునిక M5 చిప్ ను తీసుకవచ్చారు. ఈ కొత్త ipad రెండు వేరియంట్లలో (11 అంగుళాలు, 13 అంగుళాల) OLED డిస్‌ప్లేతో అందుబాటులోకి రానుంది. 11 అంగుళాల వేరియంట్ 5.3 మిల్లీమీటర్ల మందంతో ఉండగా, 13 అంగుళాల మోడల్ మరింత సన్నగా 5.1 మిల్లీమీటర్ల మందంతో రూపొందించబడింది. ఈ కొత్త iPad Pro తో పాటు, ఆపిల్ MacBook Proను కూడా లాంచ్ చేసింది.

అబ్బురపరిచే ఫీచర్స్, స్టైలిష్ డిజైన్ తో నేడు విడుదల కాబోతున్న Oppo Find X9, Oppo Find X9 Pro, Oppo Pad 5..!

ఈ కొత్త iPad Pro లో 10-core GPU, 16-core న్యూరల్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది అత్యధికంగా 16GB RAM + 2TB స్టోరేజ్ తో వస్తుంది. 256GB, 512GB వేరియంట్లలో 9-core CPU ఉంటే.. 1TB, 2TB మోడళ్లలో 10-core CPU లభిస్తుంది. M4 ప్రాసెసర్‌తో పోలిస్తే.. కొత్త M5 చిప్ 1.5 రెట్లు వేగంగా 3D రెండరింగ్, 1.2 రెట్లు వేగంగా వీడియో ట్రాన్స్‌కోడింగ్ పనితీరు అందిస్తుంది. అలాగే డ్రా థింగ్స్ ఫర్ iPadలో 2 రెట్లు వేగంగా AI ఇమేజ్ జనరేషన్, DaVinci Resolve for iPadలో 2.3 రెట్లు వేగంగా AI వీడియో అప్‌స్కేలింగ్ పనితీరు అందిస్తుంది.

ఈ టాబ్లెట్ C1X సెల్యులార్ మోడెమ్, N1 వైర్లెస్ చిప్ తో వస్తుంది. డిస్‌ప్లే పరంగా చూస్తే.. ఇది 13-అంగుళాల అల్ట్రా రెటీనా XDR OLED స్క్రీన్ కలిగి ఉంది. ఇందులో ప్రోమోషన్(120Hz), త్రు టోన్, 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా అడాప్టివ్ సింక్ సపోర్ట్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ గల ఎక్స్టర్నల్ డిస్‌ప్లేలను కూడా ఉపయోగించవచ్చు. కనెక్టివిటీ కోసం Wi-Fi 7, బ్లూటూత్ 6 సపోర్ట్ కలదు. ఇక కెమెరా విభాగంలో, వెనుక భాగంలో 12MP ప్రధాన కెమెరా (f/1.8 aperture, 5x digital zoom), ముందు భాగంలో 12MP సెంటర్ స్టేజి సెల్ఫీ కెమెరా (f/2.0 aperture) లభిస్తాయి. వెనుక కెమెరా 4K వీడియోలు 60fps వరకు రికార్డ్ చేయగలదు. ముందు కెమెరా 1080p వీడియోలు 60fps వరకు రికార్డ్ చేయగలదు.

Modi Trump Meeting: రష్యా నుండి చమురు కొనుగోలు ఆపబోతున్న భారత్.. ట్రంప్ ఏమన్నారంటే?

అలాగే బ్యాటరీ వివరాలు చూస్తే.. 11-అంగుళాల మోడల్‌లో 31.29Wh బ్యాటరీ ఉంటుంది. ఇది Wi-Fi పై వెబ్ సర్ఫింగ్ లేదా వీడియో వీక్షణలో 10 గంటల బ్యాకప్ అందిస్తుంది. అలాగే, USB Type-C పవర్ అడాప్టర్ ద్వారా కేవలం 30 నిమిషాల్లో 50% చార్జింగ్ సాధ్యమవుతుంది. అయితే వేగవంతమైన ఛార్జింగ్ కోసం ఆపిల్ ప్రత్యేకంగా రూపొందించిన 70W USB-C పవర్ అడాప్టర్ వాడాలని కంపెనీ సూచించింది. భారత మార్కెట్‌లో 11-అంగుళాల iPad Pro (Wi-Fi మోడల్) ధర రూ.99,990 నుండి ప్రారంభమవుతుంది. Wi-Fi + Cellular మోడల్ రూ.1,19,900 నుంచి లభిస్తుంది. 13 అంగుళాల వేరియంట్‌లో Wi-Fi మోడల్ ధర రూ.1,29,900 కాగా, Wi-Fi + Cellular మోడల్ రూ.1,49,900కి లభిస్తుంది. కొత్త iPad Pro మోడల్‌లకు 256GB, 512GB, 1TB, 2TB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఇది స్పేస్ బ్లాక్, సిల్వర్ కలర్‌లలో అందుబాటులో ఉంటుంది. ప్రీ-ఆర్డర్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇవి అక్టోబర్ 22 నుంచి ఆపిల్ వెబ్‌సైట్‌, ఆఫ్లైన్ స్టోర్లు, మరియు రిటైల్ భాగస్వాముల ద్వారా విక్రయాలు మొదలవుతాయి.