Oppo Find X9, Oppo Find X9 Pro, Oppo Pad 5: ఒప్పో (Oppo) నేడు (అక్టోబర్ 16) కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లైన Oppo Find X9 సిరీస్, టాబ్లెట్ Oppo Pad 5 ను చైనాలో అధికారికంగా విడుదల చేయబోతోంది. ఈ సిరీస్‌లో Oppo Find X9, Oppo Find X9 Pro అనే రెండు మోడళ్లు ఉండనున్నాయి. లాంచ్‌కు ముందు కంపెనీ కొత్త మొబైల్స్, టాబ్లెట్స్ గురించి పలు కీలక వివరాలు వెల్లడించింది. ఇందులో Find X9 సిరీస్‌లో MediaTek Dimensity 9500 చిప్‌సెట్ ఉండగా, Oppo Pad 5, Find X9, Find X9 Pro ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 పై రన్ అవుతాయి.
PM Modi AP Tour: ఏపీలో ప్రధాని భారీ బహిరంగ సభ.. రూ.13,430 కోట్లతో…
కొన్ని నివేదికల ప్రకారం.. Oppo Find X9 ధర భారత మార్కెట్‌లో సుమారు రూ.65,000 నుండి ప్రారంభం కానుందని అంచనా. ఈ ఫోన్ ఛేజింగ్ లైట్ రెడ్, వెల్వెట్ టైటానియం, ఫ్రొష్టి వైట్, ఫాగ్ బ్లాక్ వంటి నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. Oppo Find X9 Pro ధర దాదాపు రూ.1,00,000 లోపే ఉండవచ్చని అంచనా. ఈ ప్రో మోడల్‌లో కూడా నాలుగు కలర్ ఆప్షన్లు ఉంటాయి. అయితే ఫాగ్ బ్లాక్ స్థానంలో బ్రౌన్ షేడ్ లభిస్తుంది. ఈ రెండు ఫోన్లు కూడా 12GB + 256GB, 12GB + 512GB, 16GB + 512GB, 16GB + 1TB వంటి RAM + స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉండనున్నాయి.
PM Modi AP Tour: ఏపీలో ప్రధాని భారీ బహిరంగ సభ.. రూ.13,430 కోట్లతో…
ఇక Oppo Pad 5 టాబ్లెట్ విషయానికి వస్తే.. దీని ధరపై కంపెనీ ఇంకా అధికారిక సమాచారం ఇవ్వలేదు. అయితే లిస్టింగ్స్ ప్రకారం ఈ టాబ్లెట్ 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB, 16GB + 512GB వేరియంట్లలో లభించవచ్చు. ఈ టాబ్లెట్ గాలక్సీ సిల్వర్, స్పేస్ గ్రే, గాలక్సీ సిల్వర్ సాఫ్ట్ లైట్ ఎడిషన్, లక్కీ పర్పుల్ సాఫ్ట్ లైట్ ఎడిషన్ వంటి నాలుగు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. మొత్తం మీద ఒప్పో Find X9 సిరీస్ కొత్త డిజైన్, అధునాతన చిప్‌సెట్ ఇంకా ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 సాఫ్ట్‌వేర్‌తో విడుదల కానుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. లాంచ్ అనంతరం ఫోన్ల ధరలు, పూర్తి స్పెసిఫికేషన్లు, గ్లోబల్ గా ఎప్పుడు రాబోతుందన్న వివరాలు వెలువడే అవకాశం ఉంది.