Leading News Portal in Telugu

Honor Earbuds 4 Launch with Dual-Tone TWS with ANC, Touch Controls and 46-Hour Battery


Honor Earbuds 4: హానర్ (Honor) తన త్రూలి వైర్ లెస్ స్టీరియో (TWS) హెడ్‌ఫోన్స్ Honor Earbuds 4 ను బుధవారం అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ Honor Magic 8 స్మార్ట్‌ఫోన్స్, Honor MagicPad 3 సిరీస్ టాబ్లెట్లు లాంచ్ సందర్భంగా విడుదలయ్యాయి. ఇవి ఇన్ ఇయర్ డిజైన్‌లో లభిస్తాయి. ఇవి 50dB వరకు Active Noise Cancellation (ANC) సపోర్ట్ చేస్తాయి. ఇయర్ ఫోన్స్ డబుల్ టిటానియం ప్లేటెడ్ కోయిల్స్ తో అమర్చబడి ఉన్నాయి. చార్జింగ్ కేస్‌తో కలిపి, ఒకసారి ఫుల్ చార్జ్‌తో 46 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందించగలవని కంపెనీ చెబుతోంది.

మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో ‘Digital Campus on Google Cloud’ ప్రారంభం..!

ఇక Honor Earbuds 4 సంబంధించి ఫీచర్ల పరంగా చూస్తే.. Honor Earbuds 4 డ్యూయల్ టోన్ ఫినిష్, టచ్ కంట్రోల్స్ తో వస్తాయి. ఇందులో 11mm, 6mm డ్యూయల్ మాగ్నటిక్ సర్క్యూట్ టిటానియం ప్లేటెడ్ డైనమిక్ డ్రైవర్స్ అమర్చబడ్డాయి. ANC తోపాటు డ్యూయల్ ట్రాన్స్పరెన్సీ మోడ్, ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్, AI ఆధారిత 3 మైక్ సిస్టమ్ కలిగి, 6m/s విండ్స్ నాయిస్ రిడక్షన్ సపోర్ట్ చేస్తుంది. దీని ఫ్రీక్వెన్సీ రిస్పాన్స్ 20Hz – 20,000Hz వరకు ఉంది. ఇది బ్లూటూత్ 5.3, డ్యూయల్ డివైస్ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది.

ఇది ఒకసారి ఫుల్ చార్జ్‌తో Earbuds 4 ANC ఆన్ కాకుండా 9 గంటలు, ANC ఆన్ తో 5 గంటలు వాడుకకు వీలుగా ఉంటాయి. చార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 46 గంటల వరకు వాడవచ్చు. ఒక్క 10 నిమిషాల క్విక్ చార్జ్‌తో సుమారు 3 గంటల ఉపయోగం సాధ్యమని కంపెనీ తెలిపింది. ప్రతి ఇయర్ బర్డ్ లో 45mAh సెల్, చార్జింగ్ కేస్‌లో 500mAh బ్యాటరీ ఉంది. ఇది USB టైపు-C పోర్ట్, ఇన్డికేటర్ లైట్ కలిగిన డ్యూయల్-టోన్ చార్జింగ్ కేస్‌తో వస్తుంది. ఇయర్ బడ్స్ కు IP54 రేటింగ్ ఉండటంతో ధూళి, స్ప్లాష్ రిసిస్టెంట్ అవుతాయి.

Fake Liquor Case: నకిలీ మద్యం కేసు.. వైరల్‌గా మారిన వాట్సాప్ ఛాటింగ్..

ఇవేకాక Honor Smart Space App తో కంపాటిబుల్‌గా ఉంటాయి. ఇక ధర విషయానికి వస్తే.. Honor Earbuds 4 ధర CNY 399 (రూ.5,000)గా నిర్ణయించబడింది. ఇక లాంచ్ ఆఫర్ కింద అక్టోబర్ 15 నుండి నవంబర్ 30 వరకు ప్రత్యేక ఆఫర్‌లో CNY 349 (రూ.4,300) లకే లభిస్తాయి. ఇవి పెరల్సెంట్ వైట్, స్టార్రి స్కై బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు ఈ ఇయర్ బడ్స్ ను అధికారిక ఆన్లైన్, ఆఫ్లైన్ హానర్ స్టోర్స్, అథారైజ్డ్ రీసెల్లర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.