Leading News Portal in Telugu

Sundar Pichai reveals how he felt when OpenAI launched ChatGPT before Google


  • గూగుల్ కంటే ముందే ఓపెన్-ఏఐ చాట్‌జీపీటీని ప్రారంభించినప్పుడు
  • సుందర్ పిచాయ్ రియాక్షన్ ఏంటంటే?

గూగుల్ కంటే ముందు ఓపెన్ఏఐ చాట్‌జిపిటిని ప్రారంభించినప్పుడు తనకు ఎలా అనిపించిందో సుందర్ పిచాయ్ వెల్లడించారు. గూగుల్ కంటే ముందే ఓపెన్ఏఐ చాట్‌జిపిటిని ప్రారంభించడం పట్ల మీ స్పందన గురించి సేల్స్‌ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్ అడగగా.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. అందరు ఊహించినదాని కంటే భిన్నంగా, ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు. ఓపెన్‌ఎఐ 2022 చివరలో చాట్‌జీపీటీని విడుదల చేసినప్పుడు, సుందర్ పిచాయ్ కి అది ఒక ‘కోడ్ రెడ్’గా మారిందన్నారు.

గూగుల్ ఎప్పటికీ ఎఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగంలో ప్రధాన స్థానంలో ఉందని, అయినా ఈ ‘చిన్న శాన్‌ఫ్రాన్సిస్కో కంపెనీ’ వచ్చి చాట్‌జీపీటీతో మార్కెట్‌ను షేక్ చేసిందని పిచాయ్ చెప్పాడు. సేల్స్‌ఫోర్స్ డ్రీమ్‌ఫోర్స్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, అతను తన భావాలను బయటపెట్టాడు.”చాట్‌జీపీటీ విడుదల అయినప్పుడు, బయటి ప్రపంచం భావించినట్టు నాకు భయం లేదు, మరింత ఉత్సాహం కలిగింది. ఎందుకంటే నాకు తెలుసు, ఎఐ రంగంలో విండో (సమయం) మారిపోయిందని,” అని పిచాయ్ తెలిపాడు. చాట్‌జీపీటీ (ChatGPT) లాంచ్ అయినప్పుడు టెక్ ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఓపెన్‌ఎఐ (OpenAI) అనే చిన్న కంపెనీ ఈ చాట్‌బాట్‌ను 2022 చివర్లో విడుదల చేసినప్పటికీ, గూగుల్ వంటి దిగ్గజం కూడా ఆశ్చర్యపోయింది.