సెల్ ఫోన్ ఎక్కువ సేపు ఛార్జింగ్ పెడుతున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే.. సాధారణం మనం సెల్ ఫోన్ 100 శాతం నిండేవరకు ఛార్జింగ్ పెడతాం. కానీ మనకు అదే సమస్యగా మారుతుందని మీకు తెలుసా.. 100 శాతం చార్జింగ్ పెట్టడంతో తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. నేటి కాలంలో మొబైల్ ఫోన్లు లేకుండా మనం బతకలేని పరిస్థితి వచ్చింది. కొందరు ఛార్జింగ్ పెట్టేటపుడు సెల్ ఫోన్ జేబులో పెట్టుకోవడమో.. ఛార్జింగ్ పెట్టడమో చేస్తుంటారు. ఇక రైళ్లలో, బస్సుల్లో చార్జింగ్ పెట్టుకునే వాళ్లు మాత్రం ఒక అడుగు ముందుకేసి.. వీడియోలు, సినిమాలు చూస్తుంటారు. అలా చేయడం కూడా ప్రమాదమో.. మళ్లీ 100 శాతం అయ్యే వరకు అలాగే పెడతుంటారు. ఎవరైనా అలా చేయడం కరెక్ట్ కాదని చెబితే.. వారిపై తిరగబడే వాళ్లు ఉన్నారు.
కొంతమంది నిపుణులు బ్యాటరీ ఎక్కువ రోజులు రావడానికి ఫోన్‌ను 20 శాతం నుంచి 80 శాతం మధ్య ఛార్జ్ చేయాలని చెబుతుంటారు. అయితే జనాలు మాత్రం తమ స్మార్ట్ఫోన్లను 100 శాతం పూర్తిగా ఛార్జ్ చేస్తుంటారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం మొబైల్ ఫోన్ బ్యాటరీ మన్నికగా ఎక్కువ రోజులు రావాలంటే అసలు ఎంత వరకు ఫోన్ ఛార్జ్ చేయాలో ఇక్కడ చెబుతున్నారు. బ్యాటరీని 100 శాతం ఛార్జ్ చేస్తే, ఫోన్ వేడెక్కుతుంది. ఈ వేడి క్రమంగా బ్యాటరీ సామర్థ్యాన్ని నాశనం చేస్తుంది. ప్రతి బ్యాటరీకి పరిమిత సంఖ్యలో ఛార్జ్-డిశ్చార్జ్ సైకిల్స్ ఉంటాయి. 100 శాతం ఛార్జ్ చేస్తే ఈ చక్రాలు త్వరగా ముగుస్తాయి. అందువల్ల ఇది త్వరగా బ్యాటరీ లైఫ్ టైంను తగ్గిస్తుంది.
చాలా మంది రాత్రి పడుకునే ముందు తమ ఫోన్లను ఛార్జ్ చేస్తుంటారు. 100 శాతం ఛార్జ్ అయిన తర్వాత కూడా ఫోన్‌ను ఎక్కువసేపు విద్యుత్ సరఫరాకు కనెక్ట్ చేసి ఉంచితే, అది బ్యాటరీపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. మొబైల్ ఫోన్ బ్యాటరీ జీవితకాలం ఎక్కువ కాలం కొనసాగించడానికి నిపుణులు ఓ చిట్కా సూచిస్తున్నారు. అదేంటంటే మీ మొబైల్ ఫోన్ బ్యాటరీని 20 శాతం నుంచి 80 శాతం మధ్య ఛార్జ్ చేసుకోవాలి. ఎందుకంటే 100 శాతం ఛార్జింగ్‌తో పోలిస్తే 80 శాతం ఛార్జింగ్ బ్యాటరీపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. అది వేడెక్కే అవకాశాన్ని తగ్గిస్తుంది. కాబట్టి మీ ఖరీదైన స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని ఎక్కువ కాలం మంచి స్థితిలో ఉంచుకోవాలనుకుంటే 100 శాతం ఛార్జింగ్ చేసే అలవాటును మార్చుకోవడం మంచిది. బదులుగా 80 శాతం ఛార్జింగ్ చేస్తే పరిపోతుంది.