REDMAGIC 11 Pro, 11 Pro+: చైనా మార్కెట్లో గేమింగ్ బ్రాండ్ REDMAGIC తన తాజా ఫ్లాగ్‌షిప్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్స్ REDMAGIC 11 Pro, REDMAGIC 11 Pro+ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్లు అత్యాధునిక Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌తో లాంచ్ అయ్యాయి. కంపెనీ ప్రకారం ఈ ప్రాసెసర్‌తో ఫోన్ AnTuTu 11 బెంచ్‌మార్క్‌లో 4.35 మిలియన్ పాయింట్లు సాధించింది. ఈ ఫోన్లలో గరిష్టంగా 24GB LPDDR5T ర్యామ్, 1TB UFS 4.1 PRO స్టోరేజ్ అందించబడింది. మరి ఈ స్మార్ట్ ఫోన్స్ లోని పూర్తి వివరాలను చూసేద్దామా..
డిస్‌ప్లే:
ఈ సిరీస్‌లో 6.85 అంగుళాల 1.5K OLED BOE X10 డిస్‌ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2592Hz PWM డిమ్మింగ్, DC డిమ్మింగ్ సపోర్ట్ చేస్తుంది. 95.3% స్క్రీన్ టు బాడీ రేషియోతో ఈ డిస్‌ప్లే గేమింగ్ సమయంలో అత్యుత్తమ విజువల్ అనుభూతిని ఇస్తుంది.
ప్రొఫెషనల్ గేమింగ్ పనితీరు:
REDMAGIC 11 Pro సిరీస్ గేమింగ్ పనితీరు కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇందులో Ultra Graphics Engine 3.0, స్వదేశీ RedCore R4 చిప్ ఉన్నాయి. వీటి సహాయంతో గేమ్స్‌ను 2K రిజల్యూషన్‌లో 144Hz వద్ద అప్‌స్కేల్ చేయవచ్చు. అలాగే ఇందులో PC ఎమ్యులేటర్ కూడా అందించారు, ఇది గేమర్లకు పీసీ లెవెల్ అనుభవాన్ని ఇస్తుంది.
Camel skating: ఇదేందయ్యా ఇది.. ఒంటె స్కెటింగ్ చేయడమేంటి..? అది కూడా నడిరోడ్డుపై..!
అత్యాధునిక కూలింగ్ టెక్నాలజీ:
గేమింగ్ సమయంలో వేడిని నియంత్రించేందుకు డ్యూయల్ లిక్విడ్ అండ్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ను ఉపయోగించారు. ఇందులో AI సర్వర్ గ్రేడ్ ఫ్లోరోలిక్విడ్ కూలెంట్, టర్బో ఫ్యాన్ 4.0 (24,000 rpm), లిక్విడ్ మెటల్ 3.0, 4D కూలర్ VC సిస్టమ్ వంటి నాలుగు పొరల థర్మల్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఉంది. ఈ సిస్టమ్ వల్ల కూలింగ్ సామర్థ్యం 50% పెరిగిందని కంపెనీ చెబుతోంది.
స్టైలిష్ డిజైన్:
ఈ కొత్త ఫోన్‌లో కనిపించే ట్రాన్స్‌పరెంట్ లిక్విడ్ కూలింగ్ రింగ్ దృష్టిని ఆకర్షిస్తుంది. ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్‌తో, ఎటువంటి కెమెరా బంప్ లేకుండా ఫోన్‌ను స్మూత్ లుక్‌తో రూపొందించారు. ఇది ట్రాన్స్పరెంట్ బ్లాక్, ట్రాన్స్పరెంట్ సిల్వర్, బ్లాక్, సిల్వర్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.
టచ్ కంట్రోల్స్ అండ్ గేమింగ్ ఫీచర్లు:
ఫోన్‌లో ఉన్న కొత్త Synaptics టచ్ చిప్ 3000Hz టచ్ సాంప్లింగ్ రేట్‌ను అందిస్తుంది. అంతేకాకుండా ఇందులో 520Hz షోల్డర్ ట్రిగ్గర్స్, 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు గేమింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఈ ఫీచర్లు ప్రొఫెషనల్ గేమర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయి.
సాఫ్ట్‌వేర్ అండ్ AI ఫీచర్లు:
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత REDMAGIC OS 11 పై నడుస్తుంది. ఇందులో AI అసిస్టెంట్ MORA అనే కొత్త స్మార్ట్ అసిస్టెంట్ ఉంది. ఇది AI సోషల్, AI ఆబ్జెక్ట్ రెకగ్నిషన్, AI స్క్రీన్ సెర్చ్ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఇవి ప్రస్తుతం చైనా వెర్షన్‌కు మాత్రమే పరిమితం కానున్నాయి.
Akhilesh Yadav: ‘‘దీపాలు, క్యాండిల్స్‌పై డబ్బు వృథా చేయొద్దు’’.. దీపావళి వేళ క్రిస్మస్‌పై అఖిలేష్ పొగడ్తలు..
కెమెరా ఫీచర్లు:
REDMAGIC 11 Pro సిరీస్ లో డ్యూయల్ 50MP ప్రధాన కెమెరాలు, 16MP అండర్ డిస్‌ప్లే ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. AI ఆధారిత ఆబ్జెక్ట్ రిమూవల్, ఇమేజ్ ఎక్సపెన్షన్ ఫీచర్లతో పాటు, 8K60Hz అండ్ 4K144Hz లైవ్ స్ట్రీమింగ్ సపోర్ట్ కూడా అందించారు. ఫోటోగ్రఫీ, వీడియో క్వాలిటీ రెండింటినీ బాగా సమతుల్యంగా రూపొందించారు.
బ్యాటరీ:
REDMAGIC 11 Pro+ లో 7500mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్, 80W వైర్‌లెస్ ఛార్జింగ్ ఉన్నాయి. అదే REDMAGIC 11 Proలో 8000mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో లభిస్తుంది. ఇవి గేమర్లకు రోజంతా నిరంతర ఆట అనుభవాన్ని ఇస్తాయి.
ధరలు:
REDMAGIC 11 Pro సిరీస్ ఫోన్లు చైనా మార్కెట్లో విభిన్న వేరియంట్లలో అందుబాటులోకి వచ్చాయి. REDMAGIC 11 Pro 12GB+256GB మోడల్ ధర ¥4999 (రూ.61,790)గా ఉంది. అలాగే 16GB+512GB వేరియంట్ ధర ¥5699 (రూ. 70,440)గా నిర్ణయించారు. ఇక REDMAGIC 11 Pro+ బ్లాక్ 12GB+256GB మోడల్ కూడా ¥5699కి లభిస్తుంది. ఇక అదే ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌ను ఇష్టపడే గేమర్ల కోసం REDMAGIC 11 Pro+ ట్రాన్స్పరెంట్ 16GB+512GB మోడల్ ధరను ¥6499 (రూ.80,330)గా నిర్ణయించారు. ఇక టాప్ వేరియంట్స్ తో కూడిన 24GB+1TB మోడల్ ధర ¥7999 (రూ.98,850) గా నిర్ణించారు. ఇక గోల్డెన్ సాగ స్పెషల్ ఎడిషన్ 24GB+1TB అనే ప్రీమియమ్ వెర్షన్‌ను కూడా REDMAGIC విడుదల చేసింది. ఇది ప్రత్యేకమైన లిక్విడ్ గోల్డ్ కూలింగ్, కార్బన్ ఫైబర్ బాడీ, కలెక్టర్స్ గిఫ్ట్ బాక్స్‌తో వస్తూ ¥9899 (రూ.1,22,325)కి లభిస్తుంది. REDMAGIC 11 Pro సిరీస్ ఇప్పటికే చైనాలో విక్రయానికి అందుబాటులో ఉంది. గేమింగ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అంతర్జాతీయ వెర్షన్‌ను నవంబర్ 7న అధికారికంగా ప్రకటించనున్నారు.