Leading News Portal in Telugu

iQOO Neo 10R 5G Gets Massive 21% Discount.. 6400mAh Battery, 50MP Camera & Snapdragon 8s Gen 3 at rs.26,998 only


IQOO Neo 10R 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ iQOO నుండి వచ్చిన iQOO Neo 10R 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు వినియోగదారులకు మరింత అందుబాటులోకి వచ్చింది. దీపావళి సందర్భంగా ఈ ఫోన్ ధర భారీగా తగ్గింది. దీని అసలు ధర రూ. 33,999/- ఉండగా, ప్రస్తుతం 21% తగ్గింపుతో కేవలం రూ. 26,998/- కే లభిస్తుంది. ఈ తగ్గింపుతో పాటు, EMI ఆప్షన్లు, అదనపు కూపన్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

నేడే అత్యాధునిక ఫీచర్లతో iQOO 15, iQOO Neo 11 లాంచ్..!

ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ 3 వేరియంట్స్ లో లభ్యమవుతుంది. ఇందులో మెరుగైన Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ ను ఉపయోగించారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఇది భారతదేశంలోనే అత్యంత స్లిమ్ 6400mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపు పొందింది. ఈ మొబైల్ ముఖ్యంగా గేమింగ్ ఔత్సాహికుల కోసం 5 గంటల పాటు అత్యంత స్థిరమైన 90FPS పనితీరును అందిస్తుందని కంపెనీ పేర్కొంది. గేమింగ్, దైనందిన అవసరాలకు పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌ను కోరుకునే వారికి ఇది సరైన ఎంపికగా చెప్పవచ్చు.

Bihar Elections: మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్.. విడివిడిగానే విపక్షాలు పోటీ

అలాగే ఇందులో విజువల్స్ కోసం 144Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. కెమెరా విభాగంలో 50MP Sony OIS సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 6400mAh భారీ బ్యాటరీని 80W ఫ్లాష్‌ఛార్జింగ్ సపోర్ట్‌తో అందించారు. ఈ ఫీచర్లన్నీ కలిసి iQOO Neo 10R 5Gని ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్తమ మిడ్ రేంజ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలబెడుతున్నాయి.