iQOO 15 and iQOO Neo 11 Launch Today in China with Snapdragon 8 Elite Gen 5, 144Hz AMOLED Display, 7000mAh Battery
iQOO 15, iQOO Neo 11: iQOO కంపెనీ తన తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లైన iQOO 15 మరియు iQOO Neo 11 ను ఈరోజు (అక్టోబర్ 20, 2025) చైనాలో లాంచ్ చేయనుంది. ఈ లాంచ్ ఈవెంట్ స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు) ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్‌ను కంపెనీ అధికారిక Weibo పేజ్ లేదా చైనా వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించవచ్చు.
Saves Her Mother’s Life:తన తల్లి ప్రాణాలను కాపాడిన ఆరేళ్ల చిన్నారి..
ఇకపోతే లీకైన నివేదికల ప్రకారం.. iQOO 15లో 6.85 అంగుళాల Samsung M14 LEAD AMOLED డిస్ప్లే ఉంది. ఇది 3168×1440 పిక్సెల్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. స్క్రీన్‌కి తేలికపాటి కర్వ్ ఎడ్జ్‌లు, అవుట్‌డోర్ విజిబిలిటీ కోసం AR కోటింగ్ కూడా ఉంది. ఇక కెమెరా విభాగంలో 50MP ప్రైమరీ సెన్సార్ (1/1.56-inch), 50MP అల్ట్రా వైడ్ లెన్స్, అలాగే Sony IMX882 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌తో 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ ఉంటుంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది.
పర్ఫార్మెన్స్ కోసం Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌తో పాటు గరిష్టంగా 24GB ర్యామ్, 1TB స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. అలాగే గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి Q3 గేమింగ్ చిప్ కూడా ఉంది. ఇక ఇందులో బ్యాటరీ సామర్థ్యం 7,000mAh ఉండగా, ఇది 100W వైర్డ్ మరియు 40W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్పీకర్లు, USB-C (Gen 3.2) పోర్ట్, IP68/69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కూడా అందించబడ్డాయి. ఫోన్‌లో OriginOS 6 (Android 16) ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. iQOO 15 స్మార్ట్‌ఫోన్ ధర చైనాలో సుమారు రూ.50,000 లోపు ఉండే అవకాశం ఉంది. ఇది Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌తో వచ్చే అత్యంత తక్కువ ధర ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా నిలవనుంది. భారత మార్కెట్లో దీని ధర సుమారు రూ.60,000 లోపు ఉండవచ్చని అంచనా.
UPI Payments: దేశంలో యూపీఐ ద్వారా 85 శాతం చెల్లింపులు..
ఇక iQOO Neo 11 స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఇది “Facing the Wind” అనే ప్రత్యేక రంగు వేరియంట్‌లో లభిస్తుంది. దీని డిజైన్ లైట్ చేంజ్‌కు అనుగుణంగా షేడ్స్ మారే ఫ్లోటింగ్ మిరర్ డిజైన్ గా ఉంటుంది. ఇది సాటిన్ AG గ్లాస్ బ్యాక్, మెటల్ ఫ్రేమ్, మరియు IP68+69 రేటింగ్ తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో BOE Q10+ 2K OLED డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్క్రీన్‌లో AR యాంటీ-రిఫ్లెక్షన్, యాంటీ గ్లేర్ కోటింగ్ కూడా ఉంది. పనితీరులో ఇది Snapdragon 8 Elite చిప్‌సెట్‌తో, 7,500mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కెమెరా విభాగంలో 50MP ప్రధాన లెన్స్ (OISతో), అలాగే 50MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది కూడా OriginOS 6 (Android 16) ఆధారంగా పనిచేస్తుంది. ఈ లాంచ్ ఈవెంట్‌లో iQOO నుంచి మరిన్ని ఆసక్తికరమైన ఉత్పత్తులు కూడా పరిచయం అయ్యే అవకాశం ఉంది.