Leading News Portal in Telugu

Realme GT 8 Launch: 200MP Camera and 7000mAh Battery in Realme GT 8


  • మంగళవారం ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్
  • 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ
  • రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌లో వింత ఫీచర్స్

Realme GT 8 Pro Launch Date in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ తన జీటీ సిరీస్‌లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. రియల్‌మీ జీటీ 8, రియల్‌మీ జీటీ 8 ప్రోలు మంగళవారం (అక్టోబర్ 21)న రిలీజ్ కానున్నాయి. రేపే లాంచ్ కానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ల కీలక ఫీచర్స్ కొన్నింటిని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఆ ఫీచర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోన్‌లలో ఎన్ని అంగుళాల డిస్‌ప్లే, ఏ ప్రాసెసర్, ఎన్ని మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయో తెలుసుకుందాం.

Realme Gt 8 Pro Price

రియల్‌మీ గత సంవత్సరం రిలీజ్ చేసిన రియల్‌మీ జీటీ 7కి అప్‌గ్రేడ్ వేరియంట్లే ఈ రియల్‌మీ జీటీ 8, రియల్‌మీ జీటీ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు. రెండు ఫోన్‌లలో 7000mAh బ్యాటరీని కలిగి ఉంటాయి. ఈ బ్యాటరీ జీటీ 7 ప్రో (6500mAh) కంటే పెద్దది. రెండు ఫోన్‌లు 120W వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. అయితే జీటీ 8 ప్రోలో 50W వైర్‌లెస్, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇదే రెండిటి మధ్య ప్రధాన తేడా. కేవలం 15 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుందని రియల్‌మీ పేర్కొంది.

Realme Gt 8 Pro

రియల్‌మీ జీటీ 7 ఫోన్ 2K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫ్లాట్ OLED ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. అదనంగా హ్యాండ్‌సెట్ భద్రత కోసం అండర్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ ఉంటుంది. ఫోన్ Android 16 ఆధారంగా Realme UI 7పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, వెనుక భాగంలో 200MP కెమెరా సెన్సార్ ఉంటాయి. డాల్బీ విజన్‌తో 120fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. మల్టీ టాస్కింగ్ కోసం R1 చిప్‌తో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉంటుంది.

Realme Gt 8 Pro Launch