- ‘ఐకూ’ నుంచి మరో కొత్త ప్యాడ్
- 10000mAh బ్యాటరీ, 12.05 ఇంచెస్ స్క్రీన్
- ఐకూ ప్యాడ్ 5ఈలో పవర్ ఫుల్ ఫీచర్స్
iQOO Pad 5e Launch and Price: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ వివో సబ్ బ్రాండ్ ‘ఐకూ’ మరో కొత్త ప్యాడ్‌ను తీసుకొచ్చింది. ఈరోజు చైనాలో ‘ఐకూ ప్యాడ్ 5ఈ’ని కంపెనీ విడుదల చేసింది.‘ఐకూ 15’ 5జీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఈ ప్యాడ్‌ను లాంచ్ చేసింది. ప్యాడ్, స్మార్ట్‌ఫోన్‌తో పాటు కంపెనీ iQOO వాచ్ GT 2, iQOO TWS 5 ఇయర్‌బడ్‌లను కూడా లాంచ్ చేసింది. ఇక ఐకూ ప్యాడ్ 5ఈ పవర్ ఫుల్ ఫీచర్స్ ఏంటో మనం తెలుసుకుందాం.
ఐకూ ప్యాడ్ 5ఈ 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 12.05-అంగుళాల 2.8K LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది సున్నితమైన విజువల్స్, వేగవంతమైన టచ్ ప్రతిస్పందనను కలిగి ఉంటుంది. దీని డిస్‌ప్లే DC డిమ్మింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. అంటే మీరు సుదీర్ఘంగా ప్యాడ్ చూసినా.. కంటికి రక్షణ ఇస్తుంది. ఈ టాబ్లెట్ 4nm స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఆక్టా-కోర్ ప్రాసెసర్, అడ్రినో 750 GPU ద్వారా రన్ అవుతుంది. Android 15పై OriginOS 5తో వచ్చింది. ఈ ప్యాడ్ 8GB నుండి 16GB RAM.. 128GB, 256GB, లేదా 512GB స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది.
ఐకూ ప్యాడ్ 5ఈలో 8-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. దీనికి క్వాడ్-స్పీకర్ సిస్టమ్ కూడా ఉంది. ఇందులో 10,000mAh బ్యాటరీ ఉండగా.. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. బిగ్ బ్యాటరీ కాబట్టి మీరు గంటలతరబడి ప్యాడ్‌ను వాడుకోవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi 6, బ్లూటూత్ 5.4 మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.ఈ ప్యాడ్ బరువు 584 గ్రాములు. ప్రారంభ ధర చైనాలో 1,999 యువాన్లు (సుమారు ₹24,700). టాప్ వేరియెంట్ 2,999 యువాన్లు (సుమారు ₹37,100) వరకు ఉంటుంది. ఈ టాబ్లెట్ మూడు రంగులలో (ఐల్ ఆఫ్ మ్యాన్, గ్రే క్వార్ట్జ్, సిల్వర్ వింగ్స్) లభిస్తుంది. iQOO Pad 5e శక్తివంతమైన, బెస్ట్ ఫీచర్లతో వచ్చిన టాబ్లెట్. ఇది గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ అండ్ మల్టీ టాస్కింగ్ కోసం మంచి ఎంపిక అని చెప్పొచ్చు.