Leading News Portal in Telugu

Fake Online Shopping Scam Alert in India | Cyber Experts Warn Shoppers During Festival Season


  • ఆన్ లైన్ లో షాపింగ్ లో పెరిగిపోతున్న స్కామ్ లు
    జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్న నిపుణులు

మీరు ఎక్కువగా ఆన్ లైన్ లో షాపింగ్ చేస్తున్నారా.. అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు..చాలామంది ఫెస్టివల్ సీజన్‌ లో ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తుంటారు .ముఖ్యంగా ఆడవాళ్లు ఎక్కువగా ఆన్ లైన్ షాపింగ్ చేస్తుండడంతో.. ఇదే అదునుగా చేసుకుని సరికొత్త ఆన్‌లైన్ స్కామ్‌లకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. అయితే కొత్తగా.. ఫేక్‌ వెబ్‌సైట్ ఆన్‌లైన్ షాపింగ్ స్కామ్‌ గురించి వెలుగులోకి వచ్చింది.

ఆన్‌లైన్ షాపింగ్ పెరగడంతో సైబర్ నేరస్థులు కొత్త రకం స్కామ్స్ చేస్తున్నారు కొందరు సైబర్ నేరగాళ్లు. నకిలీ ఇ-కామర్స్ వెబ్‌సైట్స్ క్రియేట్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలాంటి కేసులు దేశవ్యాప్తంగా అనేక చోట్ల వెలుగులోకి వస్తున్నాయి. కస్టమర్లు ఆన్‌లైన్ ఆర్డర్ చేసి పేమెంట్ చేస్తున్నారు. కానీ ఎలాంటి ప్రొడక్ట్స్ అందుకోవట్లేదు. తీరా ఆరా తీస్తే అవన్నీ ఫేక్ సైట్స్ అని తేలింది. ఆన్‌లైన్ లో షాపింగ్ చేసేవాళ్లను టార్గెట్ గా చేసుకుని స్కామర్లు కొత్త రకం స్కామ్ లను క్రియేట్ చేస్తున్నారు. ఆఫర్లు, డిస్కౌంట్ల పేర్లతో ప్రజలను మోసం చేస్తున్నారు.

ఈ స్కామ్ లో స్కామర్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ను పోలి ఉండే నకిలీ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు క్రియేట్ చేస్తారు. అందులో ఆకర్షణీయమైన ఆఫర్‌లు, భారీ డిస్కౌంట్‌లు ఉన్నట్టు పోస్టర్ లు పెట్టి కింద లింక్ పోస్ట్ చేస్తారు. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఒక నకిలీ ఇ–కామర్స్ సైట్ ఓపెన్ అవుతుంది. అది అచ్చం నిజమైన సైట్ లాగే అనిపిస్తుంది. అందులో ప్రొడక్ట్స్ కూడా కనిపిస్తాయి. కస్టమర్లు వాటిని కొనుగోలు చేస్తే మోసపోయినట్టేనని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటికి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు. పేమెంట్ ముందుగానే చేసేయాలి. పేమెంట్ చేశాక ఎన్ని రోజులు వెయిట్ చేసినా ప్రొడక్ట్ ఇంటికి రాదు. కొంతకాలానికి అసలు వెబ్ సైట్ కూడా కనపడకుండా పోయినా ఆశ్చర్య పోవనవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇదే ఫేక్ ఇ–కామర్స్ స్కామ్. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఈ తరహా మోసాలు ఎక్కువ అయినట్టు సైబర్ పోలీసులు చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.