OnePlus Ace6: వన్ ప్లస్ (OnePlus) సంస్థ తమ కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus Ace6 ను అక్టోబర్ 27న చైనాలో OnePlus 15 తో పాటు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే తెలిపింది. ఈ నేపథ్యంలో, ఈ మొబైల్ కీలక వివరాలు చైనా టెలికాం వెబ్సైట్లో ముందుగానే లీక్ అయ్యాయి. OPPO PLQ110 మోడల్ నంబర్‌తో ఈ మొబైల్ ఈ లిస్టింగ్ ఫోన్ సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్లను మొదటిసారిగా బయటకు వచ్చాయి. OnePlus ఇప్పటికే క్విక్ సిల్వర్ (Quicksilver), ఫ్లాష్ వైట్ (Flash White), రేసింగ్ బ్లాక్ (Racing Black) రంగులను ఫోన్‌కు ప్రకటించింది.
ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభవం.. 98 అంగుళాల Xiaomi TV S Pro Mini LED లాంచ్.. ధర ఎంతంటే.?
చైనా టెలికాం లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ యొక్క కొలతలు (dimensions), బరువు (weight), గ్లాస్ బ్యాక్ వివరాలు ధృవీకరించబడ్డాయి. కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్లో అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుందని, అలాగే IP66/68/69/69K పూర్తి దుమ్ము, నీటి నిరోధకత రేటింగ్లను కలిగి ఉంటుందని ప్రకటించింది. అంతేకాకుండా ఈ విభాగంలోనే అతిపెద్ద 7800mAh సూపర్ లార్జ్ బ్యాటరీతో వస్తుందని తెలిపింది. ఈ ఫోన్ ఇటీవలే Geekbench లిస్టింగ్‌లో కూడా కనిపించి, అద్భుతమైన స్కోర్లతో పాటు 16GB RAM ను కలిగి ఉంటుందని వెల్లడించింది.
ఈ స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్ప్లేను 2800×1272 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో, 165Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. దీనికి ఆక్టా కోర్ Snapdragon 8 Elite 3nm మొబైల్ ప్లాట్‌ఫారమ్ తో పాటు Adreno 830 GPU కలిగి ఉంది. మెమరీ, స్టోరేజ్ విషయానికి వస్తే.. ఇందులో 12GB / 16GB LPDDR5X ర్యామ్, 256GB / 512GB / 1TB UFS 4.1 స్టోరేజ్ ఎంపికలలో లభిస్తుంది. అలాగే కెమెరాల విషయానికి వస్తే.. వెనుకవైపు OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) తో కూడిన 50MP ప్రధాన కెమెరా, 8MP 120° అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఇది 4K 60 fps వీడియో రికార్డింగ్‌కు మద్దతిస్తుంది. ముందువైపు 16MP కెమెరా ఉంది.
BSNL Prepaid Offer: బీఎస్ఎన్ఎల్ రూ.199 రీఛార్జ్ ప్లాన్‌పై డిస్కౌంట్.. ఎంత ఆదా అవుతుందంటే?
ఈ మొబైల్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ColorOS 16 ఇంటర్ఫేస్తో పనిచేస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, అదనంగా ఇన్ఫ్రారెడ్ సెన్సార్ ఇందులో ఉన్నాయి. ఆడియో కోసం USB Type-C పోర్ట్‌తో పాటు స్టీరియో స్పీకర్లు అందించబడ్డాయి. ఈ మొబైల్ ప్రధాన ఆకర్షణ 7800mAh బ్యాటరీ, 120W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. ఇక కనెక్టివిటీ ఎంపికలలో 5G SA/NSA, Dual 4G VoLTE, అత్యాధునిక Wi-Fi 7, Bluetooth 5.4, NFC మరియు USB Type-C 2.0 ఉన్నాయి. OnePlus Ace6 స్మార్ట్‌ఫోన్ 12GB + 256GB, 16GB + 256GB, 12GB + 512GB, 16GB + 512GB, 16GB + 1TB వేరియంట్లలో లభించనుంది. ఇక ధరల వివరాలు వచ్చే వారం అధికారికంగా ఫోన్ విడుదలైనప్పుడు తెలుస్తాయి.