Realme P3 Lite 5G vs POCO M7 Pro 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 5G ఫోన్ల ధరలు ఈ మధ్య కాలంలో కాస్త తగ్గుతున్నాయి. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ సేల్స్‌లో ప్రముఖ బ్రాండ్‌లైన POCO, Realme తమ లేటెస్ట్ 5G మోడళ్లను సరసమైన తగ్గింపు ధరలతో అందిస్తున్నాయి. కేవలం 12,000 లోపు ధరలో లభిస్తున్న POCO M7 Pro 5G, Realme P3 Lite 5G స్మార్ట్‌ఫోన్లలో ఏది మెరుగైనది? కెమెరా, డిస్‌ప్లే, ప్రాసెసర్ మరియు బ్యాటరీ వంటి కీలక అంశాల ఆధారంగా ఈ రెండు ఫోన్లను వివరంగా పోల్చి, మీకు సరిపోయే మోడల్‌ను ఎంచుకోవడానికి ఇక్కడ పూర్తి వివరాలను చూసేద్దాం.. ధరల తగ్గింపు తర్వాత ఏ ఫోన్ ఎంత ధరకు లభిస్తోంది..? ఏ ఫీచర్లు దేనిలో మెరుగ్గా ఉన్నాయో చూద్దాం..
Australia Women: ఇండోర్‌లో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు వేధింపులు!
మొదటగా ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లో కెమెరా విషయానికి వస్తే.. POCO M7 Pro 5G స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో f/1.5 అపెర్చర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP Sony LYT-600 మెయిన్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 20MP సెల్ఫీ కెమెరా ఉంది. దీనికి భిన్నంగా, Realme P3 Lite 5G వెనుక భాగంలో కేవలం 32MP సింగిల్ కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా మాత్రమే ఉన్నాయి. కాబట్టి, కెమెరా పరంగా POCO M7 Pro 5G స్పష్టంగా మెరుగ్గా ఉంది.
ఇక డిస్‌ప్లే, డిజైన్ విషయానికి వస్తే.. POCO M7 Pro 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్, 2100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. దీనికి గొరిల్లా గ్లాస్ 5 రక్షణ కూడా ఉంది. అయితే, Realme P3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌లో అదే 6.67 అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నప్పటికీ ఇది కేవలం 625 నిట్స్ బ్రైట్‌నెస్ మాత్రమే అందిస్తుంది. అందువల్ల మెరుగైన డిస్‌ప్లే కోరుకునేవారు POCO M7 Pro 5G ని ఎంచుకోవచ్చు. ఇక పనితీరు విషయంలో POCO M7 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లో 6nm ప్రాసెస్‌పై ఆధారపడిన MediaTek Dimensity 7025 Ultra ప్రాసెసర్‌ను ఉపయోగించారు. మరోవైపు, Realme P3 Lite 5Gలో 6nm ప్రాసెస్‌తో తయారైన MediaTek Dimensity 6300 5G ప్రాసెసర్ ఉంది. అయినప్పటికీ, హై-ఎండ్ పనులను నిర్వహించడంలో POCO M7 Pro 5G మెరుగైన పనితీరును అందిస్తుంది.
Rain in Hyderabad: హైదరాబాదీలు జాగ్రత్త.. పలు చోట్ల వర్షం.. జలమయమైన రహదార్లు..!
రెండు మొబైల్స్ బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే.. POCO M7 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లో 5110mAh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అయితే, Realme P3 Lite 5G ఫోన్‌లో మరింత పెద్దదైన 6000mAh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది కూడా 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇక ధరలలో భారత మార్కెట్లో విడుదలైన POCO M7 Pro 5G స్మార్ట్‌ఫోన్ (6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్) అసలు ధర రూ.18,999 కాగా, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 39% ధర తగ్గింపు తర్వాత దీనిని కేవలం రూ.11,499కే కొనుగోలు చేయవచ్చు. మరోవైపు, Realme P3 Lite 5G (6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్) ధర రూ.13,999గా ఉంది. అయితే 23% ధర తగ్గింపుతో దీనిని రూ.10,749కే సొంతం చేసుకోవచ్చు.మొత్తంగా తాజా సాఫ్ట్‌వేర్ (Android 15 with Realme UI 6.0), పెద్ద బ్యాటరీ ప్యాక్ కావాలనుకునేవారు POCO M7 Pro 5G కి బదులుగా Realme P3 Lite 5G ని ఎంచుకోవచ్చు.