Leading News Portal in Telugu

Motorola G96 5G vs Motorola Edge 60 Fusion 5G: Best Mid-Range Smartphone Comparison


Motorola G96 vs Motorola Edge 60 Fusion: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మొటొరోలా (Motorola) వైవిధ్యమైన, ఆకర్షణీయమైన మోడళ్లతో స్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మంచి పనితీరు, నాణ్యమైన కెమెరా, ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తూ వస్తోంది. ఇకపోతే మిడ్ రేంజ్ ధరల్లో లభిస్తున్న Motorola G96 5G, Motorola Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్‌లు మంచి స్పెసిఫికేషన్లతో పోటీపడుతున్నాయి. మరి ఈ రెండు ఫోన్ల కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ మరియు ధరల పరంగా వాటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను ఇక్కడ వివరంగా చూద్దాం.

Liquor Shop Draw: మద్యం షాపుల డ్రాకు తొలగిన అడ్డంకులు.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!

ముందుగా ఈ రెండు మొబైల్స్ కెమెరా విభాగంలో రెండు ఫోన్లలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. Motorola G96 5Gలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP ప్రధాన సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో OISతో కూడిన 32MP సెల్ఫీ కెమెరా ఉంది. మరోవైపు, Motorola Edge 60 Fusion 5Gలో కూడా OISతో కూడిన 50MP ప్రధాన కెమెరా ఉంది. అయితే ఇది 13MP అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ కెమెరా కూడా 32MPగా ఉంది. అల్ట్రా-వైడ్ సెన్సార్‌లో అధిక రిజల్యూషన్ ఉండటం వల్ల Motorola Edge 60 Fusion మొబైల్ మరింత వైవిధ్యమైన, మెరుగైన కెమెరా సెటప్ లభిస్తుంది.

ఇక పనితీరు పరంగా చూస్తే.. Motorola G96 5G స్మార్ట్‌ఫోన్ Snapdragon 7s Gen 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అయితే, Motorola Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Dimensity 7400 ప్రాసెసర్‌ను అందించారు. సాఫ్ట్‌వేర్ పరంగా G96 5G ఫోన్‌కు ఒక OS అప్‌గ్రేడ్, 3 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లు లభిస్తాయి. కానీ, Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్ Android 15 తో రన్ అవుతూ.. 3 OS అప్‌గ్రేడ్‌లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది. కాబట్టి ఎక్కువ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ కావాలంటే Edge 60 Fusion ఉత్తమ ఎంపిక.

Cardamon Benefits: రోజుకు రెండంటే.. రెండు చాలు.. ఆరోగ్యమే కాదు.. శృంగార జీవితంలోను..!

ఇక బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే.. ఈ రెండు ఫోన్లలో 5,500 mAh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌నే అందించారు. అయితే ఛార్జింగ్ వేగంలో తేడా ఉంది. Motorola G96 5G స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కానీ, Motorola Edge 60 Fusion స్మార్ట్‌ఫోన్ మాత్రం 68W వేగవంతమైన ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వడమే కాకుండా రివర్స్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. వేగంగా ఛార్జ్ కావాలని కోరుకునే వారికి Edge 60 Fusion మెరుగైన ఎంపికగా నిలుస్తుంది. చివరగా ధరల విషయానికి వస్తే,, 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ Motorola G96 5G ధర రూ.15,999 నుండి మొదలవుతుంది. అదే వేరియంట్‌తో ఉన్న Motorola Edge 60 Fusion 5G ధర రూ.19,999 నుండి మొదలవుతుంది. ఈ రెండు ఫోన్ల మధ్య ఏకంగా రూ.4,000 తేడా ఉంది. కాబట్టియు మొత్తంగా చూస్తే.. మెరుగైన అల్ట్రా-వైడ్ కెమెరా, వేగవంతమైన ఛార్జింగ్, ఎక్కువ కాలం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల కోసం వినియోగదారులు Edge 60 Fusion కొనుగోలు చేయాలంటే ఈ అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.