Nike Project Amplify: పురుషులయందు పుణ్య పురుషులు వేరు అన్నట్లుగానే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని షూలలో కంటే ఈ బూట్లు వేరని చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఎందుకంటే ఈ బూట్లలో ప్రత్యేకమైన బ్యాటరీ మోటారు ఉంటుంది కాబట్టని పేర్కొన్నారు. మీకు తెలుసా.. ఈ సూపర్ షూలను నైక్ అభివృద్ధి చేస్తోందని. దీని పేరు ఏంటంటే.. ప్రాజెక్ట్ యాంప్లిఫై. పలు నివేదికల ప్రకారం.. ఈ బూట్లకు ప్రపంచంలోనే మొట్టమొదటి పవర్డ్ ఫుట్‌వేర్ వ్యవస్థ, ప్రత్యేకమైన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.
READ ALSO: Perni Nani: ఎంపీ కేశినేని చిన్ని మునిగిపోతున్న నావ.. పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
ఈ బూట్ల ప్రత్యేకతలు..
ప్రాజెక్ట్ యాంప్లిఫై కింద లభించే బూట్లు సాధారణ ప్రజలు నడవడానికి, వేగంగా పరిగెత్తడానికి సహాయపడతాయి. ఈ బూట్లు ఎలక్ట్రిక్ సైకిళ్లు లేదా స్కూటర్లుగా పని చేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. వీటిని ధరిస్తే గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తవచ్చని పేర్కొన్నారు. ఈ సాంకేతికత ప్రజలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. ఈ షూ ఒక ప్రత్యేకమైన సెటప్‌తో వస్తుంది. దీనికి మోకాలి కింద ధరించే బ్రాస్లెట్ లాంటి నిర్మాణం ఉంటుంది. ఈ బ్రాస్లెట్‌లో మోటారు, డ్రైవ్ బెల్ట్, రీఛార్జబుల్ బ్యాటరీలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ, డిజైన్ చాలా తేలికైనదిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ నైక్ షూస్ లోపల ఉన్న మోటారు బ్యాటరీ వినియోగదారులు నడవడానికి, పరిగెత్తడానికి సహాయపడతాయి. వీటిని ధరించడం ద్వారా పాదాలపై పడే అధిక ఒత్తిడిని తగ్గిస్తాయని చెబుతున్నారు. షూస్ కండరాలలా పనిచేస్తాయని కంపెనీ వెల్లడించింది. అయితే వినియోగదారుడికి కావాలనుకుంటే ఈ వ్యవస్థను తొలగించి కూడా ఉపయోగించవచ్చని చెప్పింది. వీటిని ఉపయోగించి అథ్లెట్లు 15-20 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలరని కంపెనీ పేర్కొంది. ఈ సూపర్ షూలను 400 మంది అథ్లెట్ల సహకారంతో అభివృద్ధి చేస్తున్నట్లు, ఇప్పటికే వీటిపై విస్తృతమైన పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత వీటిని మార్కెట్లోకి విడుదల చేస్తామని, ఆ సమయంలో బూట్ల ధరను అధికారికంగా ప్రకటిస్తామని కంపెనీ తెలిపింది.
READ ALSO: Salman Khan – Pakistan: సల్మాన్ ఖాన్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన పాకిస్థాన్.. ఇప్పుడు ఏం జరుగుతుంది?